breaking news
ganapathi celebrations
-
'గణపతి పూజ'లో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ (ఫోటోలు)
-
Tadepalli: గణపతి పూజలో వైఎస్ జగన్
-
Pune: భారీ వర్షం మధ్య గణపతికి ఆహ్వానం
పూణె: భారీవర్షం నడుమ మహారాష్ట్రలోని పూణెవాసులు గణపతికి స్వాగతం పలికారు. #WATCH | Pune, Maharashtra | A procession is being carried out to take Shrimant Dagdusheth Halwai Ganpati idol to the 'Pandal' for 'Sthapana' pic.twitter.com/P6J77wEgo9— ANI (@ANI) August 27, 2025నగరంలో ప్రముఖంగా నెలకొల్పిన కస్బా గణపతి, తంబ్డి జోగేశ్వరి గణపతి, గురూజీ తాలిమ్ గణపతి, తులసిబాగ్ గణపతి, కేసరివాడ గణపతి, దగ్దుషేత్ హల్వాయి గణపతి, భౌసాహెబ్ రంగరి గణపతి తదితర వినాయక మండలాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.Punekars Welcome Ganpati Bappa With Devotion Despite Heavy Rains pic.twitter.com/YBVi15wNx1— Pune First (@Pune_First) August 27, 2025నగరం అంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది పలువురు తమ ఇళ్లకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. నగరంలో మొత్తం 3,959 గణేశ్ మండపాలు ఏర్పాటయ్యాయి.ఉత్సవాలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు పూణే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఇందుకోసం ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలతో కూడిన నిఘా కెమెరాలు, ఆధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు, మొబైల్ నిఘా వాహనాలు, డ్రోన్ ఆధారిత వైమానిక పర్యవేక్షణ, జీపీఎస్ ట్రాకర్లు వినియోగిస్తున్నారు.రాష్ట్ర శబ్ద కాలుష్య నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతులిచ్చారు.శాంతిభద్రతల దృష్ట్యా ఆగస్టు 27, సెప్టెంబర్ 6వ తేదీలలో పూణే జిల్లా అంతటా మద్యం అమ్మకాలు నిషేధించారు. -
Hyderabad: చివరి దశకు ఖైరతాబాద్ గణపతి పనులు
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. వినాయక చవితికి మరో అయిదు రోజులే ఉండటంతో మహాగణపతి తయారీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడని దివ్యజ్ఞాన గురూజీ విఠల్ శర్మ తెలిపారు. ఈ నెల 25న మహాగణపతికి నేత్రోనిలన కార్యక్రమం ఉంటుందని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి తరలివస్తున్న గణనాధులు
-
గణపతి రూపంలో కాకుండా వేరే రూపాల్లో గణపతిని తయారు చేయవచ్చా..?
-
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్త సందోహం
-
డెన్మార్క్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
కొపెన్ హెగెన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో కొపెన్ హెగెన్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటూ అత్యంత వైభవంగా గణేషుని ఉత్సవాలు జరిపి , చివరిరోజు భారీ ర్యాలీగా డానిష్ వీధుల్లో ఊరెంగించి సరస్సులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డాన్యులతో దారిపొడవునా సందడి చేశారు. గణేష్ ఉత్సవాలు భారతీయుల ఐక్యతకు నిదర్శనం అని టీఏడీ అధ్యక్షులు సతీష్ రెడ్డి సామ అన్నారు. వేలంపాటలో గణేష్ లడ్డూ, కలశం, పట్టు వస్త్రం గెలుచుకున్న అశ్విన్కుమార్, రాజు పోరెడ్డి, జయచందర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలకు అన్ని విధాలుగా సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాడ్ బోర్డు సభ్యులు సంగమేశ్వర్ పగిల్ల, జయచందర్ రెడ్డి, వెంకటేష్, రాజారెడ్డి, రఘు కలకుంట్ల, ఉపేందర్, జగదీష్, దాము, రంజిత్, కరుణాకర్, రాజు ముచంతుల, వాసు, డేవిడ్ క్రిస్టీన్, నర్మద, ప్రీమియం సభ్యుల సహకారంతో నిర్వహించారు. -
ఖైరతాబాద్ గణపతి వేడుకలకు గవర్నర్ దంపతులు
ముషీరాబాద్ (హైదరాబాద్): వినాయక చతుర్ధి సందర్భంగా ఈ నెల 17వ తేదీన నిర్వహించే తొలి పూజకు ఖైరతాబాద్ గణపతి ఉత్సవ నిర్వాహకులు గవర్నర్ నరసింహన్ దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. 17వ తేదీ ఉదయం 9.45 నిమిషాలకు పూజా కార్యక్రమాలకు హాజరు కావడానికి గవర్నర్ నరసింహన్ అంగీకరించినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్ తెలిపారు. గవర్నర్ను పూజకు ఆహ్వానించిన వారిలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ సహా పలువురు ఉన్నారు.