డెన్మార్క్‌లో ఘనంగా గణేష్‌ ఉత్సవాలు | Ganpathi utsavalu held in Denmark by TAD | Sakshi
Sakshi News home page

డెన్మార్క్‌లో ఘనంగా గణేష్‌ ఉత్సవాలు

Sep 19 2018 11:07 AM | Updated on Sep 19 2018 11:11 AM

Ganpathi utsavalu held in Denmark by TAD - Sakshi

కొపెన్‌ హెగెన్‌ : తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌(టాడ్‌) ఆధ్వర్యంలో కొపెన్‌ హెగెన్‌లో గణేష్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటూ అత్యంత వైభవంగా గణేషుని ఉత్సవాలు జరిపి , చివరిరోజు భారీ ర్యాలీగా డానిష్‌ వీధుల్లో ఊరెంగించి సరస్సులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డాన్యులతో దారిపొడవునా సందడి చేశారు. 


గణేష్‌ ఉత్సవాలు భారతీయుల ఐక్యతకు నిదర్శనం అని టీఏడీ అధ్యక్షులు సతీష్‌ రెడ్డి సామ అన్నారు. వేలంపాటలో గణేష్‌ లడ్డూ, కలశం, పట్టు వస్త్రం గెలుచుకున్న అశ్విన్‌కుమార్‌, రాజు పోరెడ్డి, జయచందర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలకు అన్ని విధాలుగా సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాడ్‌ బోర్డు సభ్యులు సంగమేశ్వర్‌ పగిల్ల, జయచందర్‌ రెడ్డి, వెంకటేష్‌, రాజారెడ్డి, రఘు కలకుంట్ల, ఉపేందర్‌, జగదీష్‌, దాము, రంజిత్‌, కరుణాకర్‌, రాజు ముచంతుల, వాసు, డేవిడ్‌ క్రిస్టీన్‌, నర్మద, ప్రీమియం సభ్యుల సహకారంతో నిర్వహించారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement