గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ట్రంప్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై తాజాగా ఈయూ ఫారెన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ స్పందించారు. మిత్ర దేశాల మధ్య వైరం వల్ల పరోక్షంగా రష్యా-చైనాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని తెలిపారు.
డెన్మార్క్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. అయితే ఈ అధిక పన్నులను ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దీనిపై మాట్లాడుతూ ట్రంప్ బెదిరింపులు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ అంశంపై ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ ఎక్స్‌లో స్పందించారు.
ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ "మిత్రులమధ్య వైరం వల్ల చైనా, రష్యాలు లబ్ధిపొందే అవకాశం ఉంది. గ్రీన్‌లాండ్ భద్రత ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. దానిని నాటోలో అంతర్గతంగా చర్చించుకోవాలి. ఈ అధిక పన్నుల వల్ల యూరప్ దేశాలతో పాటు అమెరికా పేదదేశంగా మారే అవకాశం ఉంది". అని ఆమె అన్నారు. అదేవిధంగా ఈ అంశం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సహయాన్ని పక్కదారి పట్టించేదిగా ఉండకూడదన్నారు.
అయితే గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలు, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్ దేశాలపై ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. ఫిబ్రవరి 10 నుంచి అది అమలులోకి వస్తుందని తెలిపారు. దీనిపై ఆ దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.


