
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. వినాయక చవితికి మరో అయిదు రోజులే ఉండటంతో మహాగణపతి తయారీ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడని దివ్యజ్ఞాన గురూజీ విఠల్ శర్మ తెలిపారు. ఈ నెల 25న మహాగణపతికి నేత్రోనిలన కార్యక్రమం ఉంటుందని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.