నర్సరీ నుంచే ఇంగ్లిష్‌ మీడియం ఉండాలి: తెలంగాణ విద్యా కమిషన్‌ | Telangana Education Commissions Proposals for Policy Reform | Sakshi
Sakshi News home page

నర్సరీ నుంచే ఇంగ్లిష్‌ మీడియం ఉండాలి: తెలంగాణ విద్యా కమిషన్‌

Feb 26 2026 9:25 PM | Updated on Feb 26 2026 9:26 PM

Telangana Education Commissions Proposals for Policy Reform

హైదరాబాద్‌:  తెలంగాణ విద్యా కమిషన్‌ కీలక సిఫారుసులు చేసింది.  సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో భాగంగా విద్యా కమిషన్‌ పలు సిఫారుసులు చేసింది.

తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు:
1. ఉపాధ్యాయుల పదోన్నతులు: ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు, పని తీరు ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలి.
2. బోధనా మాధ్యమం: ఇంగ్లీష్ ఉండాలి, నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు.
3. త్రిభాషా విధానం: ఒకటో తరగతి నుంచే తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించాలి.
4. విద్యార్థి కేంద్రంగా విద్యా విధానం: విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలి.
5. EAPCET రద్దు: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి.
6. D.EI.ED రద్దు: బీఎడ్‌ను పునర్వ్యవస్థీకరించాలి.
7. పాఠశాలల్లో వంట వండే మహిళలకు చెల్లింపులు: వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి.
8. IIT-JEE/NEET కోచింగ్ సెంటర్లు: నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి.
9. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్: వేరు చేయాలి.
10. విశ్వ విద్యాలయాల కార్యనిర్వాహక మండలి పునర్నిర్మాణం: వైస్ ఛాన్సలర్ ఛైర్మన్‌గా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement