
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి సోమవారం ఉదయం 10.30 గంటలకు కంటి పాపను అమర్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్.

విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే చేశామని, ఈసారి మహాగణపతిని దర్శించుకునే భక్తులకు అన్ని విఘ్నాలు తొలగిపోవడంతో పాటు విశ్వశాంతి నెలకొనేందుకే విశ్వశాంతి మహా గణపతిగా నామకరణం చేసినట్లు విఠల్ శర్మ సిద్ధాంతి తెలిపారు.

ఖైరతాబాద్ మహాగణపతికి సోమవారం సాయంత్రం ఆగమన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా స్కూలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా మరాఠా బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు, తలపాగాలు ధరించి బ్యాండ్ వాయిస్తూ మహాగణపతి ఆగమనానికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.











