అమెరికాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | Telangana Formation Day celebrations in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Jun 1 2026 10:41 PM | Updated on Jun 1 2026 10:47 PM

Telangana Formation Day celebrations in America

వాషింగ్టన్, డీసీ: అమెరికా కాలిఫోర్నియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.

జూన్‌ 2 రేపు జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను క్యూపర్టినో నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం (TCA) ఆధ్వర్యంలో వార్షిక  వనభోజనాలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, సేవా భావం ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమంలో  స్థానిక ప్రవాస కుటుంబాలు, కమ్యూనిటీ నాయకులు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో తెలంగాణ వంటాకాలైన సకినాలు సర్వపిండి , ఇరానీ చాయ్ వేడివేడి సమోసాలు ఇతర హైదరాబాదీ వంటకాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన  టీసీఏ సౌత్ బే లీడర్‌షిప్ బృందం అంజనేయులు, గోపికృష్ణ, శ్రీధర్ వాలంటీర్లకు మేనేజ్‌మెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ఇతర దేశంలోనూ ఘనంగా నిర్వహిస్తున్న.. 22 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ సాంస్కృతిక సంఘం (TCA) చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement