వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు | Ambedkar Jayanti celebrations under the auspices of YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Apr 14 2026 12:01 PM | Updated on Apr 14 2026 12:51 PM

Ambedkar Jayanti celebrations under the auspices of YSRCP

సాక్షి, తాడేపల్లి:  భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీ ఆర్ అంబేద్కర్‌ 135వ జయంతిని పురస్కరించుకోని వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలో వైఎస్సార్‌సీపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి  మాజీ మంత్రులు మేరుగ‌ నాగార్జున, ఆదిమూలపు సురేష్, పార్టీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, జూపూడి ప్రభాకర్, మొండితోక అరుణ్ కుమార్, రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు దళిత నేతలు హాజరయ్యారు. ‘

అంబేద్కర్ ఆశయాలను వైఎస్‌ జగన్ కొనసాగిస్తున్నారని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శ జూపూడి ప్రభాకర్‌ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వికేంద్రీకరణకే కోరుకున్నారని ఆయన ఆశయాల అనుగుణంగానే వైఎస్‌ జగన్‌ మావిగన్‌ ప్రతిపాదన తెచ్చారన్నారు.

పలు జిల్లాల్లో.. 
రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మచిలీపట్నంలోని  వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం నియోజకవర్గం ఇంఛార్జ్ పేర్ని కిట్టు హాజరయ్యారు. సమాజంలో అంటరానితనాన్ని ,అస్పృశ్యతను రూపుమాపేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన బాట ఆదర్శనీయమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మనువాదులు మతఛాందసంతో మహనీయుడు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

విశాఖలో పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు కుంభ రవి బాబు, వరుదు కళ్యాణి, వాసుపల్లి గణేష్ , మోల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట కుమారి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు హజరయ్యారు.

	తాడేపల్లి YSRCP ఆఫీస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

అనకాపల్లి  వైఎస్సార్సీపీ కార్యాలయంలో  బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో  జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాజీఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement