
ఎంగిలిపూల బతుకమ్మతో భాగ్యనగరం పులకించింది. తీరొక్క పుష్పాలతో పుడమి పరవశించింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా తొలిరోజు ఆదివారం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కూకట్‌పల్లిలో మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ భవన్‌లో ఆ పార్టీ మహిళా నేతలు ఒక్కేసి పువ్వేసి చందమామా.. అంటూ ఆడీపాడారు. రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంతో పాటు నగరంలోని కాలనీలు, బస్తీలు, వీధివీధినా బతుకమ్మ ఆటాపాటలు వైభవంగా ప్రారంభమయ్యాయి.




























