ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆయన పెద్దగా బయట కనిపించింది లేదు. కాగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితులపై కీలక సమాచారం ప్రచురితమయ్యింది..
మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదివరకే చాలా సార్లు పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అమెరికా జరిపిన దాడిలో ఆయన కోమాలోకి వెళ్లారని తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన అసలు బ్రతికి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా మోజ్తాబా ఎప్పుడు బయిటకి రాలేదు. కేవలం వ్రాతపూర్వక కీలక సమయాల్లో కేవలం వ్రాతపూర్వక సందేశాలు మాత్రమే అందించారు.
అయితే ప్రస్తుతం మోజ్తాబా వేగంగా కోలుకుంటున్నారని ఆయన సన్నిహితులు తెలిపినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. మోజ్తాబా భౌతికంగా బయిటకి రానప్పటికీ యుద్ధానికి సంబంధించిన కీలక సమావేశాల్లో ఆయన ఆడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాల్గొంటున్నారని తెలిపింది. వాషింగ్టన్‌తో చర్చలు వంటి కీలక విషయాలలో వాయిస్ మెసేజ్ ద్వారా ఆదేశాలు ఇస్తున్నారని వెల్లడించింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటిపై జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఆ దాడిలోనే మోజ్తాబాకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన ముఖం తీవ్రంగా దెబ్బతిందని కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ రోజు నుంచి నేటి వరకూ మెజ్తాబా ఎన్నడూ మీడియా ముందుకు రాలేదు. అప్పటి నుంచి భిన్న రీతిలో ఆయనపై వార్తలు వచ్చాయి.


