ఒక్కటైన గల్ఫ్‌ దేశాలు?.. ట్రంప్‌కు ఖమేనీ బిగ్‌ షాక్‌? | Strait of Hormuz Enters New chapter says Mojtaba Khamenei | Sakshi
Sakshi News home page

ఒక్కటైన గల్ఫ్‌ దేశాలు?.. ట్రంప్‌కు ఖమేనీ బిగ్‌ షాక్‌?

Apr 30 2026 5:33 PM | Updated on Apr 30 2026 6:51 PM

Strait of Hormuz Enters New chapter says Mojtaba Khamenei

టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గల్ఫ్‌ దేశాలతో ఏకమై హర్మూజ్‌ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్‌ దేశాలకు తన స్వహస్త్రాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్‌ కథనం తెలిపింది.

గురువారం మొజ్తాబా ఖమేనీ రాసిన లేఖలో ఫిబ్రవరి 28న నుంచి అమెరికా,ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్,హర్మూజ్‌ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది.

ఇరాన్‌ గల్ఫ్‌ దేశాల్ని సురక్షితం చేస్తుందని, హర్మూజ్‌ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను’నిర్మూలిస్తుందని అన్నారు. హర్మూజ్‌  జలసంధి కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని మొజ్తాబా కమేనీ రాసిన లేఖలో స్పష్టం చేశారు.

గల్ఫ్‌ ప్రాంతంలోఅమెరికా ఉనికిని అనవసరమని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్‌ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్‌ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా ఉనికే ఆ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం. ఆ దేశానికి తన సొంత భద్రతను కాపాడుకునే సామర్థ్యం లేదు. అమెరికాను అభిమానించే వారికి, అమెరికా భద్రత కల్పిస్తుందనే ఆశ అసలు లేదు.

ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడా స్థానం లేదు. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రువులకు అక్కడ మరెక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.

ఖమేనీ రాసిన ఈ లేఖ, ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ టార్పిడో గురించి వివరిస్తూ అమెరికాను బెదిరించిన తర్వాత వెలువడింది. ఇరాన్ నేవీ తన ప్రకటనలో, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను చీల్చగల సూపర్‌ జలాంతర్గామి ఆయుధాన్ని ఊహించమని పేర్కొంది. ‘హూట్‌’ (ఇరాన్‌ భాషలో హూట్‌ అంటే తిమింగళం) అనే పేరున్న ఈ సూపర్‌ వెపన్‌ దెబ్బకు శత్రువులు భయపడుతున్నారు. యుద్ధ సమయంలో ఇరాన్ నావికాదళం బలహీనపడినప్పటికీ, త్వరలోనే కొత్త ఆయుధంతో శత్రువుపై దాడి చేస్తామని ప్రకటించింది.‘ఏ క్షణమైనా కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటాం. బహుశా వాళ్లకు హార్ట్‌ అటాక్ రాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. 

కాగా, హర్మూజ్‌ జలసంధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్‌ దేశాల భవిష్యత్తు రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement