శత్రువు ఓడిపోయింది.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ సంచలన ప్రకటన | Iran Khamenei says enemy defeated in written Nowruz message | Sakshi
Sakshi News home page

శత్రువు ఓడిపోయింది.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ సంచలన ప్రకటన

Mar 20 2026 10:56 PM | Updated on Mar 20 2026 10:56 PM

Iran Khamenei says enemy defeated in written Nowruz message

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. పర్షియన్‌ నూతన సంవత్సరం "నౌరూజ్‌" సందర్భంగా విడుదల చేసిన రాతపూర్వక సందేశంలో "శత్రువు ఓడిపోయిందంటూ.." ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి, ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత మొజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజలకు రాతపూర్వక సందేశాన్ని విడుదల చేశారు.

ఈ సందేశంలో ఖమేనీ ఇలా రాసుకొచ్చారు. మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ భిన్నతలు ఉన్నప్పటికీ ప్రజలు ఒకటిగా నిలిచారు. ఈ ఐక్యత వల్లే శత్రువు ఓటమి చెందిందని పేర్కొన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రజలను భయపెట్టి ప్రభుత్వాన్ని కూలదోయాలని భావించారు. ఇది వారు చేసిన భారీ తప్పిదమని త్వరలోనే తెలుసుకుంటారు.

శత్రువులు ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా ప్రజల్లో భయం, నిరాశ కలిగించి దేశాన్ని విభజించాలనుకున్నారు. ఇలా జరగకపోగా, శత్రువులలోనే విభేదాలు పుట్టాయి.  

ప్రాంతీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. టర్కీ, ఒమాన్‌పై జరిగిన దాడులకు ఇరాన్ బలగాలు బాధ్యులు కాదని తెలిపారు. అవి ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు అని, పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టించడమే శత్రువుల లక్ష్యమని అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా ఖమేనీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌-పాక్‌ సోదరుల్లా మెలగాలని.. ముస్లింలు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌-పాక్‌ తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement