అమెరికా-ఇజ్రాయెల్‌ మిసైళ్లు కళ్లుగప్పిన మొజ్తాబా | How Did Mojtaba Khamenei Escape From The US Israeli Joint Missile Attack, Read More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికా-ఇజ్రాయెల్‌ మిసైళ్లు కళ్లుగప్పిన మొజ్తాబా

Mar 17 2026 9:58 AM | Updated on Mar 17 2026 10:53 AM

How did Mojtaba Khamenei escape from the US Israeli missile attack

టెహ్రాన్‌: ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడిలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అమెరికా ఈ దాడిని ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రోర్ ఆఫ్ ది లయన్’ పేరుతో చేపట్టింది. ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.

దాడి సమయంలో ఖమేనీ పక్కనే ఉన్న ఆయన రెండవ కుమారుడు, నూతన సుప్రీం లీడర్‌గా భావిస్తున్న మోజ్తాబా ఖమేనీ, అమెరికా,ఇజ్రాయెల్ క్షిపణులు,యుద్ధ విమానాలు జరిపిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇరాన్ ప్రభుత్వంలోని ప్రముఖుల మధ్య జరిగిన ఒక అంతర్గత ఆడియో సంభాషణలో ఈ విషయం బయటపడిందని ది టెలిగ్రాఫ్ నివేదించింది.

ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ అధిపతి మజాహెర్ హొస్సేనీ ఆ ఆడియోలో మాట్లాడుతూ.. ‘మోజ్తాబా బయటికి వెళ్లిన సమయమే మిసైల్ దాడి జరిగింది. ఆయన ప్రాణాలతో బయటపడటానికి కారణం ఇదంతా దేవుని సంకల్పమే’ అని వివరించారు.

టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ బాలిస్టిక్ మిసైళ్లు ఖమేనీ నివాస సముదాయంపై మూడు మిసైళ్లు దాడు ప్రయోగించబడ్డాయి. ఒకటి ఖమేనీ ఉన్న ప్రాంతాన్ని తాకగా.. మరొకటి మోజ్తాబా నివాసంపై అంతస్తును ఢీకొట్టింది.  ఈ దాడి నుంచి మొజ్తాబా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయనకు కేవలం కాలి భాగంలో స్వల్ప గాయం మాత్రమే జరిగింది.

ఇరాన్ సైనికాధికారి మహ్మద్ షిరాజీ ఈ దాడిలో మరణించారు. ఆయన శరీరం పూర్తిగా ఛిద్రమైంది. మరో మిసైల్ మోజ్తాబా మరిది మిస్బాహ్ అల్-హుదా బఘేరీ కానీ నివాసమే లక్ష్యంగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన తర్వాత మోజ్తాబా ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాపించాయి. ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా ద్వారా ఆయన ఒక సందేశం పంపించారు. ‘మార్త్యుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’అని పేర్కొన్నారు.

అమెరికా ప్రతిస్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోజ్తాబా గురించి స్పష్టత లేదని తెలిపారు. కొందరు ఆయన తీవ్రంగా గాయపడ్డారని, మరికొందరు ఆయన మరణించారని చెబుతున్నారని పేర్కొన్నారు. ‘మేము ఆయనను ఇప్పటి వరకు చూడలేదు. ఆయన బ్రతికున్నాడో లేదో తెలియదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement