త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు.. ఇరాన్‌ సుప్రీం లీడర్ | Iran supreme leader says criminal murderers must pay for Larijani killing | Sakshi
Sakshi News home page

త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ డెడ్లీ వార్నింగ్‌

Mar 18 2026 11:25 PM | Updated on Mar 18 2026 11:28 PM

Iran supreme leader says criminal murderers must pay for Larijani killing

తమ కీలక సైనికాధికారి లారిజానీ హత్యపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది, లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలు లారిజానీ హత్యను ధృవీకరించిన ఒక రోజు తర్వాత మొజ్తబా ఖమేనీ ఓ ప్రజా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇజ్రాయెల్‌, అమెరికాపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.  

లారిజానీ మరణ వార్త చాలా బాధించింది. అతను విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక స్థానమున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని హత్య చేసి ఇజ్రాయెల్‌, అమెరికా చాలా పెద్ద తప్పు చేశాయి. లారిజానీ హత్య ఇస్లాం వ్యతిరేకుల ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది. లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.

కాగా, అలీ లారిజానీ దివంగత ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీకి కుడి భుజం లాంటి వ్యక్తి. కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో లారిజానీ సహా ఐఆర్‌జీసీకి చెందిన బసిజ్‌ పారామిలటరీ ఫోర్స్‌ కమాండర్‌ జనరల్‌ ఘోలమ్‌రెజా సులేమానీ మృతి చెందారు. వీరిద్దరి మరణాన్ని ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వీరిని హతమార్చాక ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లారిజానీ, సులేమానీని గ్యాంగ్‌స్టర్‌ (అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement