ప్రాణాలు కాపాడారంటూ ఇండిగో పైలట్‌పై ప్రశంసలు  

Indigo Flight Passengers Praise the Pilot for Saving Lives - Sakshi

శంషాబాద్‌(హైదరాబాద్‌): షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 6ఈ–1406 విమానంలో బయల్దేరిన తమను పైలటే కాపాడారని ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శనివారం రాత్రి 10.50 గంటలకు బయల్దేరిన విమానం షెడ్యూ­ల్‌ ప్రకారం శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆదివారం తెల్లవారు జామున 4:10 గంటలకు చేరుకో వాల్సి ఉండగా విమానంలోని సాంకేతికలోపాన్ని గుర్తించిన పైలట్‌ పాకిస్తాన్‌లోని కరాచి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. తెల్లవారు జామున విమానాన్ని కరాచి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేసిన అనంతరమే విమానంలో సాంకేతికలోపం తలె­త్తిందన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్స్‌ వెల్లడించిం­­దని ప్రయాణికులు తెలిపారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉన్న తర్వాత భోజన ఏర్పా­ట్లు చేశా రని వెల్లడించారు.

తొలుత కరాచి నుంచి ప్రయాణికులను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మీదుగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారు. ప్రత్యేక విమానంలో కరాచి నుంచి నేరుగా శంషాబాద్‌కు తీసుకొచ్చారు. పైలట్‌ సాంకేతిక లోపం గుర్తించడంతోనే తాము ప్రాణాలతో బయటపడ్డామని, కరాచిలో విమానం ల్యాండయ్యాక మాత్రమే తమకు వివరాలు వెల్లడించారని ప్రయాణికులు తెలిపారు. 

కరాచి విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ చేశాక, సుమా రు ఎనిమిది గంటలకు పైగా విమానంలోనే ఉన్నాం. పైలట్‌ గుర్తించకపోతే పెద్ద ప్రమాదం జరిగేది.                    – ఓ ప్రయాణికుడు  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top