29న పసుపు బోర్డు ప్రారంభం | Amit Shah To Inaugurate Turmeric Board Office In Nizamabad On June 29 | Sakshi
Sakshi News home page

29న పసుపు బోర్డు ప్రారంభం

Jun 27 2025 5:09 AM | Updated on Jun 27 2025 5:09 AM

Amit Shah To Inaugurate Turmeric Board Office In Nizamabad On June 29

అమిత్‌షా ప్రారంభిస్తారు.. అనంతరం నిజామాబాద్‌లో 

రైతు సమ్మేళన బహిరంగ సభ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 29న నిజా మాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అదే రోజు జరిగే రైతు సమ్మేళనం బహిరంగసభలో కూడా పాల్గొంటారని చెప్పారు. గురు వారం నిజామాబాద్‌ పర్యటనకు వచ్చిన కిషన్‌రెడ్డి ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

40 ఏళ్ల రైతుల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం నిజామాబాద్‌కు పసుపు బోర్డు ప్రకటించిందన్నారు. ఎంపీ అర్వింద్‌ కృషితో రాష్ట్ర, జాతీయ పార్టీ నిర్ణయం, ప్రధాని మోదీ ఆశీ స్సులతో పసుపు బోర్డు ఏర్పడిందని చెప్పారు.సీనియర్‌ నేత, దివంగత ధర్మపురి శ్రీనివాస్‌ విగ్రహాన్ని అమిత్‌షా ఆవిష్కరించనున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,  కాంగ్రెస్‌ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.

రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులపై తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేస్తే న్యాయం జరగదన్నారు. సమావేశంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement