ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం కొటార్మూర్–పెర్కిట్ లోని భవిష్య దర్శిని ప్రాథమికోన్నత పాఠశాల గు ర్తింపును రద్దు చేస్తూ విద్యాశాఖ అధికారులు సో మవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాల ప్రి న్సిపల్, ఉపాధ్యాయురాలు కలిసి ఉర్దూ, మతపరమైన అంశాలు బోధించడంపై తల్లిదండ్రులు, బీజే పీ నాయకులతో కలిసి యాజమాన్యాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. నచ్చిన పాఠశాలలో విద్యార్థులను చేర్పించుకోవాలని సూచించారు. పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బాళోజీ, ఆర్మూర్ ఎంఈవో రాజగంగారాం నేతృత్వంలో పాఠశాలను సీజ్ చేశారు.


