లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రంలోని పానాది రోడ్డులో ఓ వ్యక్తి పడి ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకొని వ్యక్తిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లింగంపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


