27న గిరిజన గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

27న గిరిజన గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్లు

Jul 22 2026 2:29 AM | Updated on Jul 22 2026 2:29 AM

27న గిరిజన గురుకులాల్లో స్పాట్‌ అడ్మిషన్లు ‘విక్రమ్‌’ బృందంలో కోటగిరి యువకుడు బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్‌

ఎల్లారెడ్డి: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల లు, జూనియర్‌ కళాశాలల్లో ఈ నెల 27న స్పా ట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు సంస్థ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ గంగారామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 27న ఉద యం 10 గంటలకు ఆయా కళాశాల, పాఠశాలలకు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరా రు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లిలో కొనసాగుతున్న నాగిరెడ్డిపేట పాఠశాలలో ఉ మ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని నాగిరెడ్డిపేట, బాన్సువాడ, చీమన్‌పల్లి పాఠశాల విద్యార్థుల కు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో మెదక్‌, హన్మాజీపే ట్‌, ఎల్లారెడ్డి, ఇందల్వాయి, నర్సాపూర్‌ బాలిక ల పాఠశాలల అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌ నిర్వహి స్తామన్నారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి గురుకుల పాఠశాలలో నర్సాపూర్‌ గిరిజన జూనియర్‌ క ళాశాల, నర్సాపూర్‌ సీవోఈ జూనియర్‌ కళాశా ల, కౌడిపల్లి పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహిస్తామన్నారు. గురుకుల సెట్‌ రాసిన వి ద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో చేరే విద్యార్థులకు ప్రాధాన్యత క్రమంలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.

రుద్రూర్‌: దేశీయ అంతరిక్ష రంగంలో మరో కీలక మై లురాయిగా నిలిచే విక్ర మ్‌–1 రాకెట్‌ ప్రయోగంలో కోటగిరికి చెందిన యువ ఇంజినీర్‌ భాగస్వామి కావడం స్థానికులకు గ ర్వకారణంగా మారింది. కోటగిరి మండల కేంద్రానికి చెందిన మహాజన్‌ విఠల్‌ గుప్తా కుమా రుడు మహాజన్‌ అఖిల్‌ హైదరాబాద్‌లోని ప్ర ముఖ ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్కైరూట్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ, విక్రమ్‌–1 ప్రయోగ బృందంలో సభ్యుడిగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిల్‌ తల్లి రమాదేవి, సోదరుడు రాఘవేందర్‌తోపాటు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

వినూత్న బోధనపై

దృష్టి సారించాలి

పెర్కిట్‌(ఆర్మూర్‌): విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి ఉపాధ్యాయులు బోధనలో వినూత్న పద్ధతులను అనుసరించాలని ఆర్మూర్‌ ఎంఈ వో రాజగంగారాం అన్నారు. ఆర్మూర్‌ మున్సిప ల్‌ పరిధిలోని పెర్కిట్‌ మోడల్‌ స్కూల్‌లో మంగళవారం ఎస్జీటీల కు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఎంఈవో పరి శీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎజ్టీటీలు ఇంగ్లీష్‌, గణితం, తెలుగు సబ్జెక్టుల లో సామ ర్థ్యాలను మెరుగు పరుచుకోవాలని సూ చించారు. అనంతరం రీసోర్స్‌ పర్సన్స్‌ స్వరూప, దివ్య, మధులత, రజిత ఉపాధ్యాయులకు ఇంగ్లీష్‌, గణితం, తెలుగు సబ్జెక్టులలో శిక్షణనిచ్చారు.

వాహనాల తనిఖీ

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలుగుట్ట ప్రాంతంలో ఎస్సై వినయ్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. 20 వాహనాలకు రూ. 4 వేల జరిమాన విధించారు. పెండింగ్‌ చలానాలు రూ.1450 వసూలు చేపట్టారు. అలాగే ముగ్గురిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు.

బాన్సువాడ: బా న్సువాడ ప్రభు త్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఎం.శ్రీనివాస్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన కామారెడ్డి ఆస్పత్రినుంచి డాక్టర్ల రేషనలైజేషన్‌లో భాగంగా బాన్సువాడకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌ ఆర్మూర్‌ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement