నందిపేట రథయాత్రలో పాల్గొన్న భక్తులు
నందిపేట్: మండల కేంద్రంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఇందూర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం చేపట్టిన జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. స్థానిక వివేకానంద స్వామి చౌరాస్తా వద్ద ప్రత్యేకంగా రథంపై జగన్నాఽథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి ప్రతిమలను ఉంచారు. రథానికి కేదారానంద స్వామి పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. విద్యార్థులు, కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామి మాట్లాడుతూ.. హిందూ ధర్మం ఎంతో ప్రాచీనమైనదని, పవిత్రమైనదని అన్నారు. హిందూ ధర రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. పోలీసులు ఆయా చోట్ల దారి మల్లింపు చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.


