అర్హుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అర్హుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలి

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ(సర్‌) ప్రక్రియపై భీమ్‌గల్‌ తహసీల్‌ కార్యాలయంలో అధికారులు, రాజకీ య నాయకులతో అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. మండలంలో 2 వేల ఓట్లకు సంబంధించి నమోదు, అనుబంధ ఫామ్‌ల పరిశీలనపై చ ర్చించారు. రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement