బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా వంశీగౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా వంశీగౌడ్‌

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా వంశీగౌడ్‌ సీసీఎస్‌ నుంచి నిందితుడు పరారీ ఉమామహేశ్వరుడికి పీసీసీ చీఫ్‌ పూజలు సబ్‌ రిజిస్ట్రార్‌ను బెదిరించిన ఇద్దరిపై కేసు

జక్రాన్‌పల్లి: భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన వంశీగౌడ్‌ నియమితులయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌కుమార్‌ సోమవారం నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంశీగౌడ్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేవైఎం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి , ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి , జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి కృతజ్ఞతలు తెలిపారు.

పోలీస్‌ ప్రజావాణికి

25 ఫిర్యాదులు

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ని ర్వహించిన పోలీస్‌ ప్రజావాణికి 28 ఫిర్యాదులు వచ్చారు. అదనపు డీసీపీ శుభం ప్రకాశ్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.

నిజామాబాద్‌ అర్బన్‌ : సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నిందితుడు పరారైన ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని నిఖిల్‌ సాయి చౌరస్తా వద్ద గత శనివారం ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలు తనిఖీలు చేపడుతున్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తు లు నంబర్‌ ప్లేట్‌లేని బైక్‌పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అందు లో ఒకరిని పట్టుకున్న ట్రాఫిక్‌ పోలీసులు.. నిందితుడి నుంచి బంగారు గొలుసులు, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకొని, విచారణ కోసం సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. సీసీఎస్‌ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు సోమవారం తప్పించుకున్నాడు. నిందితుడు ఎలా తప్పించుకున్నాడనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది. కాగా,ఈ ఘటనపై సీపీ సాయిచైతన్య ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌లో ఉన్న ఉమామహేశ్వరాలయంలో పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు మహేశ్‌గౌడ్‌ తెలిపారు. ఆయనవెంట మేయర్‌ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్‌ రెడ్డి, నుడా చైర్మన్‌ కేశ వేణు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: సబ్‌ రిజిస్ట్రార్‌ను బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఐదో టౌన్‌ ఎస్సై సునీల్‌ తెలిపారు. నగరంలోని కవితా కాంప్లెక్స్‌లో ఉండే రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ భూమిని రి జిస్ట్రేషన్‌ చేశారు. అయితే, ఆ భూమి అసైన్డ్‌ల్యాండ్‌ అని, ఈ విషయంలో తమకు డబ్బులు ఇవ్వాలని ఆకాశ్‌, గణేశ్‌ అనే వ్యక్తులు సబ్‌ రిజిస్ట్రార్‌ను బెదిరించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు తో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement