న్యూఢిల్లీ: ముంబైలో 26/11 దాడుల ఘటనకు 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ, భారత్ అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్ పాలసీ’ని మరోమారు స్పష్టం చేశారు. 2008 నవంబర్ 26 రాత్రి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా, ముంబై నగరంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత 60 గంటల పాటు వరుస దాడులకు పాల్పడ్డారు. ఈ అమానుష ఘటనలో మొత్తం 166 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నారిమన్ హౌస్‌లోని యూదు కేంద్రం, కామా హాస్పిటల్, మెట్రో సినిమా, లియోపోల్డ్ కేఫ్‌లను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. హోంమంత్రి అమిత్ షా తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ‘2008లో ఇదే రోజున, ఉగ్రవాదులు ముంబైపై దాడి చేసి, దారుణమైన, అమానుషమైన చర్యలకు పాల్పడ్డారు’ అని పేర్కొన్నారు. ఈ దాడులను ధైర్యంగా ఎదుర్కొంటూ, తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమిత్ షా నివాళులు అర్పించారు.
वर्ष 2008 में आज ही के दिन आतंकियों ने मुंबई पर कायराना हमला कर वीभत्स और अमानवीय कृत्य किया। मुंबई आतंकी हमलों का डटकर सामना करते हुए अपना बलिदान देने वाले वीर जवानों को नमन करता हूँ और इस कायराना हमले में अपनी जान गँवाने वाले सभी लोगों को श्रद्धांजलि अर्पित करता हूँ।
आतंकवाद…— Amit Shah (@AmitShah) November 26, 2025
ఉగ్రవాదంపై భారతదేశ స్పష్టమైన వైఖరిని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం ఒక దేశానికే కాదు, మొత్తం మానవాళికే శాపం అని అమిత్‌షా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానం స్పష్టంగా ఉందని, దీనిని ప్రపంచమంతా అభినందిస్తోందని, భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాలకు విస్తృత మద్దతు అందుతోందని హోంమంత్రి పేర్కొన్నారు. కాగా ఈ దాడుల తర్వాత, ఒకరు తప్ప మిగిలిన ఉగ్రవాదులందరూ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్‌కు 2010లో మరణశిక్ష విధించారు. రెండేళ్ల తర్వాత పూణే జైలులో కసబ్‌కు ఉరితీశారు.
ఇది కూడా చదవండి: రాజ్యాంగం జాతీయవాద మార్గదర్శి: రాష్ట్రపతి ముర్ము


