మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం.. ఇది వేగంగా ముందుకు కదులుతూ 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా పలు తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ తుపానుగా సెన్యార్‌గా(Cyclone Senyar) పేరు పెట్టారు.
మలక్కా జలసంధి (Strait of Malacca).. దక్షిణ ఆండమాన్ సముద్రం ప్రాంతంలో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం తుఫానుగా మారింది. మలేషియా జార్జ్‌టౌన్‌కు సుమారు 260 కి.మీ. పశ్చిమ-దక్షిణ పశ్చిమ దూరంలో, నికోబార్ దీవులకు 600 కి.మీ. తూర్పు-దక్షిణ తూర్పున కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా గంటకు సుమారు 10 కి.మీ. వేగంతో కదులుతోంది. కాగా.. యూఏఈ దీనికి సెన్యార్ అని సూచించింది. దీనర్థం "సింహం" అని.
IMD అంచనా ప్రకారం.. సెన్యార్ తుఫాను మొదట పశ్చిమ-దక్షిణ పశ్చిమ దిశగా కదిలి, తర్వాతి 48 గంటల్లో తిరిగి తూర్పు దిశగా మళ్లనుంది. ఇండోనేషియా సమీపంలో తీరం తాకే అవకాశం ఉందని.. 24 గంటలపాటు తుఫాను తీవ్రతను కొనసాగించి, తర్వాత క్రమంగా బలహీనపడనుందని పేర్కొంది.
సెన్యార్ ప్రభావంతో.. అండమాన్ & నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రంలో అలలు ఎత్తుగా ఎగసే అవకాశం ఉండటంతో, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.


