
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అరుదైన ఘనతను సాధించారు. ఆగస్టు 5 నాటికి దేశంలో ఎక్కువ కాలం కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన నేతల జాబితాలో గుర్తింపు పొందారు. ఆయన 2,258 రోజులు పదవిలో కొనసాగుతూ.. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ రికార్డును (2,256 రోజులు) రికార్డును బద్దలు కొట్టారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్‌షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో అమిత్ షా వరుసగా రెండోసారి కూడా హోంశాఖ బాధ్యతలనే స్వీకరించారు.
ఫలితంగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ రికార్డును అమిత్ షా అదిగమించారు. 1998-1999, 1999-2004 వరకూ ఎల్‌కే అద్వానీకేంద్ర హోం మంత్రిగా దాదాపు 2,193 రోజులు ఈ పదవిలో కొనసాగారు. ఇక కేంద్ర హోం శాఖ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తన హయాంలో ఆర్టికల్ 370 రద్దు, కొత్త న్యాయ చట్టాల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం, నక్సలిజం నిర్మూలన లక్ష్యం, ఉత్తర తూర్పు శాంతి ఒప్పందాలు, నార్కోటిక్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు.