ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్‌: అమిత్‌ షా | Amit Shah Urges Promotion Of Indian Languages, Says Those Who Speak English In Country Will Soon Feel Ashamed | Sakshi
Sakshi News home page

Amit Shah On English Language: ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్‌

Jun 19 2025 4:07 PM | Updated on Jun 19 2025 4:40 PM

Those Who Speak English In Country Will Soon Feel Ashamed: Amit Shah

ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్‌ షా చెప్పుకొచ్చారు.

మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్‌ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement