బెంగాల్, తమిళనాడుల్లో ఎన్డీఏ ప్రభుత్వాలే  | NDA will win Tamil Nadu, West Bengal, says Home Minister Amit Shah | Sakshi
Sakshi News home page

బెంగాల్, తమిళనాడుల్లో ఎన్డీఏ ప్రభుత్వాలే 

Jun 9 2025 5:33 AM | Updated on Jun 9 2025 5:33 AM

NDA will win Tamil Nadu, West Bengal, says Home Minister Amit Shah

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా 

మదురై: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని మదురైలో బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశలో అమిత్‌ షా మాట్లాడారు. అవినీతిమయమైన అధికార డీఎంకేకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. టాస్మాక్‌ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు దోచేసిన సొమ్ముతో రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కనీసం రెండు తరగతి గదులు నిర్మించవచ్చన్నారు. గత పదేళ్లలో తమిళనాడుకు కేంద్రం రూ.6.8 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement