- లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీలపై ధ్వజమెత్తిన అమిత్ షా
- మీ తనయుల కోసం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులు ఖాళీగా లేవు
- బిహార్ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా
పట్నా: బిహార్ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. ఎన్డీఏ కూటమి, మహా కూటమిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బిహార్‌లో ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ.. డ్యాన్స్ చేస్తారంటూ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయగా, దానికి బీజేపీ స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది.
ఇవి సీఎం, పీఎం పోస్టులు అని, అవేమీ మీ కోసం ఖాళీగా లేవని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ధ్వజమెత్తారు. ఈ రోజు(బుధవారం, అక్టోబర్ 29వ తేదీ) దార్‌భంగాలో ఎన్నికల ర్యాలీ చేపట్టిన అమిత్ షా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అసలు కాంగ్రెస్‌లో కానీ ఆర్జేడీలో కానీ వెవరైనా యువ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చారా? అని అమిత్ షా ప్రశ్నించారు. తమ ఎన్డీఏ కూటమి మాత్రం యువ నేతల్ని ప్రోత్సహించే క్రమంలో చాలా మందికి టికెట్లు ఇచ్చిందన్నారు. ‘ఒకరేమో( లాలూజీ) తన కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నారు.. మరొకరు(సోనియా జీ) తన తనయుడు రాహుల్ గాంధీని దేశానికి పీఎం చేయాలని అనుకుంటున్నారు. ఇవేమైనా ఖాళీగా ఉన్న పదవులా.. వచ్చి కూర్చోవడానికి. మీ కుమారుల కోసం అవేమీ ఖాళీగా లేవు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు. బిహార్‌లో ఏర్పడ్డ మహాఘట్‌బంధన్( మహా కూటమి) కాదని, అదొక దొంగల కూటమి అంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు.
‘జన్నాయక్ కర్పూరి ఠాకూర్‌కు మోదీ జీ భారతరత్న ప్రదానం చేశారు. ఇప్పుడు, వారు (ప్రతిపక్షాలు) కర్పూరి జీ నుండి ఆ బిరుదును తీసివేయాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. బాబు జగ్జీవన్ రామ్‌ను ప్రధానమంత్రి కాకుండా చేసిన కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు చూశారు’ అని తనదైన శైలిలో మహా కూటమిపై విరుచుకుపడ్డారు.
ఇదీ చదవండి::


