ఢిల్లీ: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవిందు మోహన్, ఐబి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్‌లు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.జమ్మూ కశ్మీర్ డీజీపీ వర్చువల్‌గా హాజరయ్యారు. పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది.
పలు దర్యాప్తు సంస్థలు.. బాంబు పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. పేలుడు ప్రాంతంలో ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందాలు క్లూస్ సేకరించాయి. ఎర్ర కోట ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్, చాందిని చౌక్, గురు ద్వారాలన్నీ పోలీసులు మూసివేశారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్ నాగ్‌లో డాక్టర్ ఆదిల్ అరెస్టుతో భారీ ఉగ్రకుట్ర వెలుగు చూసింది.
ఫరీదాబాద్‌లో 2900 కిలోల పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోని ఎర్రకోట వద్ద ఉగ్ర దాడి జరిగింది. ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్న సమయంలోనే ఎర్రకోట వద్ద డాక్టర్ ఉమర్ మహమ్మద్ బాంబు పేలుడుకు పాల్పడ్డాడు.


