న్యూఢిల్లీ: శతజయంతి సంవత్సరంలోకి ఇటీవలే అడుగిడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఈ దేశానికి ఇద్దరు ప్రధానులను అందించిందని, అయితే ఇంతటి ఘనత కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేయడం విచిత్రంగా ఉన్నదని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
‘ఆయన (ఎం ఖర్గే) ఆర్‌ఎస్‌ఎస్ బ్యాన్‌కు ఎటువంటి కారణం చెప్పలేదు. దేశాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి లక్షలాది మంది యువతకు ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తినిచ్చిన సంస్థ అని అందరికీ తెలుసు. దేశభక్తి, క్రమశిక్షణ విలువలను ఆర్‌ఎస్‌ఎస్ పెంపొందించింది. ఆర్‌ఎస్‌ఎస్ నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దేశానికి ప్రధానమంత్రులు అయ్యారని మనం గుర్తించాలి. ఈ కోవకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ఉత్తమ ప్రధానులుగా గుర్తింపు పొందారు’ అని అని అమిత్ షా బీహార్ రాజధాని పట్నాలో జరిగిన ‘బీహార్ పవర్ ప్లే కాన్క్లేవ్’లో ఎన్‌డీటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ఈసీఈఓ రాహుల్ కన్వాల్‌తో అన్నారు.
‘ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీకి బీజేపీకి సైద్ధాంతిక మాతృ సంస్థ. దీని క్యాడర్ బీజేపీకి ఎంతో అవసరం. దేశాభివృద్ధికి, సమాజానికి సరైన దిశను చూపించేందుకు, దేశంలోని ప్రజలను సమీకరించేందుకు, యువతను దేశం కోసం ముందుకు నడిపించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ సహకారం తప్పనిసరి. ఖర్గే ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాను. కానీ అది ఎప్పటికీ నెరవేరదు’ అని అమిత్ షా పేర్కొన్నారు.
దీనికి ముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ‘భారతదేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రధాని మోదీ గౌరవించిస్తే, ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని అన్నారు. దేశంలోని శాంతిభద్రతల సమస్యలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కారణంగానే చోటుచేసుకుంటున్నాయని’ ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని కాంగ్రెస్ సరిగా అనుసరించడం లేదని ప్రధాని మోదీ ఆరోపించిన తర్వాత కాంగ్రెస్ చీఫ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ఇంగ్లీష్, హిందీపై సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు


