‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’ | Telangana MP Bandi Sanjay Speech At Indoor | Sakshi
Sakshi News home page

‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’

Jun 29 2025 4:51 PM | Updated on Jun 29 2025 5:56 PM

Telangana MP Bandi Sanjay Speech At Indoor

నిజామాబాద్‌: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇవ్వాలని కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని,  అందుచేత బీజేపీకి అధికారం ఇవ్వాలని బండి సంజయ్‌ విన్నవించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. 

దీనిలో భాగంగా ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో బండి సంజయ్‌ ప్రసంగించారు.  ‘ రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యం. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూర్‌ రైతులు హీరోలు. ధర్మపురి అరవింద్‌ పసుపు అరవింద్‌ అయ్యారు’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.బండి సంజయ్‌న ప్రసంగానికి ఆహ్వానించిన క్రమంలో సభ చఘ్పట్లతో దద్దరిల్లింది. ప్రజా స్పందనను ఆస్వాదిస్తూ బండి సంజయ్‌ ప్రసంగాన్ని ఆలకించారు అమిత్‌ షా. 

దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్‌ షా

 

Advertisement
 
Advertisement
Advertisement