ప్రియాంకా చోప్రా తల్లి హెయిర్‌ టిప్స్‌..! ఇంట్లోనే హెయిర్‌ మాస్క్‌.. | Priyanka Chopra’s Mother Dr Madhu Chopra Shares Simple DIY Hair Mask for Thicker, Healthier Hair | Sakshi
Sakshi News home page

ప్రియాంకా చోప్రా తల్లి హెయిర్‌ టిప్స్‌..! ఇంట్లోనే హెయిర్‌ మాస్క్‌..

Jun 16 2026 11:54 AM | Updated on Jun 16 2026 12:31 PM

Beauty Tips: Priyanka Chopras Mother Shares DIY Hair Mask

ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్ మధు అఖౌరి చోప్రా గతంలో కాంతివంతమైన ముఖం కోసం సౌందర్య చిట్కాలను పంచుకోగా తాజాగా ఒత్తైన జుట్టు కోసం సింపుల్‌ హెయిర్‌ టిప్స్‌ షేర్‌ చేశారు. కురులు ఒత్తుగా దృఢంగా ఉండాలంటే సెలూన్‌లకు వెళ్లాల్సిన పనిలేదని, ఇంట్లోనే చేసే హెయిర్‌ మాస్క్‌ చక్కటి ఫలితాన్ని ఇస్తుందని అంటోంది డాక్టర్‌ మధు అఖౌరి. 

చలన చిత్ర నిర్మాణ, కాస్మెటాలజిస్ట్‌, స్టూడియో ఈస్తటిక్‌ సహా వ్యవస్థాపకురాలు అయిన డాక్టర్‌ మధు 40 ఏళ్ల వృత్తి అనుభవంతో జుట్టు సంరక్షణకు సంబంధించిన చిట్కాలు, పద్దతులు గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అదికూడా ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే హెయిర్‌ మాస్క్‌ గురించి  వివరించారు. 

తన వారపు సంరక్షణ దినచర్యలో భాగంగా ఒక హెయిర్‌ మాస్క్‌ తయారీ విధానాన్ని పంచుకున్నారు. వంటగదిలో అందుబాటులో ఉండే ఈ మాస్క్‌ జుట్టు ఒత్తుగా ఉండేందుకు ఎలా ఉపకరిస్తుందో సవివరంగా వెల్లడించారామె. 

తయారీ విధానం..
అందుకోసం కొబ్బరి నూనె, మెంతులు, రోజ్‌మేరీ (నూనెలో ఒక రోజ్‌మేరీ రెమ్మ), కొంచెం ఉడికించిన బియ్యం నీరు (గంజి), చియా విత్తనాలు తీసుకుంటానని అన్నారు. ఇక్కడ నానబెట్టిన చియా విత్తనాల వల్ల ఆ మిశ్రమం జెల్లీలాంటి ఆకృతిని పొంది, జుట్టుకు సులభంగా రాసుకునేలా మారుతుందని ఆమె తెలిపారు. 

ఒక్కో పదార్థం ఒక చిన్న చెంచా చొప్పున తీసుకుని ఒక అద్భుతమైన మాస్క్‌ను తయారు చేస్తానని అన్నారామె. దీన్ని జుట్టుకు రాసుకుని గంటసేపు ఉంచి, ఆ తర్వాత కడిగేస్తానని అన్నారామె. ఇది తన జుట్టుని ఒత్తుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుందంటూ తన వీడియోని ముంగించారు 73 ఏళ్ల మధు అఖౌరి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మరి.

 

(చదవండి: '30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement