'30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం.. | Can 108 Surya Namaskars Help You Lose Weight? Yoga Trainer On Practising 30-60-90-108 Surya Namaskars, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Surya Namaskars Benefits: '30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..

Jun 16 2026 11:23 AM | Updated on Jun 16 2026 6:12 PM

Yoga trainer on practising 30-60-90-108 Surya Namaskars

బరువు తగ్గడం కోసం జిమ్‌, ఇతర అధిక తీవ్రతర వర్కౌట్ల కంటే యోగా బెస్ట్‌ అని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందులో ఉండే కొన్ని రకాల ఆసనాలు కండరాలు, కీళ్లను బలోపేతం చేసి..అదనపు కొవ్వు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధిగాంచింది సూర్యనమస్కారాలు. వెయిట్ ట్రైనింగ్ కోసం ప్రతి వారాంతంలో చేయగల ఒక వ్యాయామం 30-60-90-108 సూర్య నమస్కారాలు. బరువు తగ్గాలనుకునేవారందరికీ ఇది బెస్ట్‌ అని చెబుతోంది ప్రముఖ యోగనిపుణురాలు రూపాళ్‌ సిధ్‌. బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌తో కూడా ఇది చేయించానని అన్నారు. ఈ ముద్దుగుమ్మ కరీనా ఒకేసారి 50 సూర్య నమస్కారాలు, ఆ తర్వాత 108 రౌండ్లు చేసేదన్నారు. మరి అంతలా సూర్యనమస్కారాలు ఎలా చేయాలి..?, బరువు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితరాల గురించి ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.

యోగా నిపుణురాలు సిధ్‌ బరువు తగ్గాలనుకుంటే..సూర్యనమస్కారాలు ఎలా చేయాలి, ఎలాంటి టిప్స్‌ ఫాలో అవ్వాలి, వంటి వాటి గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు. ముందుగా చేయాల్సినవి కొన్ని..

  • ప్రతిరోజూ 10 వేల అడుగులు వేయండి

  • వేగంగా కొవ్వు తగ్గించుకోవడానికి, జీవక్రియను పెంచేందుకు ప్రతిరోజూ 6 పూటలా చిన్న చిన్న భోజనాలు చేయండి

  • వెయిట్ ట్రైనింగ్‌తో కండరాలను పెంచుకోండి. బరువులు ఎత్తడం ప్రారంభించండి, కానీ క్రమంగా పెంచండి

  • ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు త్రాగండి

  • ఉదయం పూట ముందుగా కొవ్వును కరిగించండి

  • ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల యోగా/వర్కౌట్ చేయండి

  • ప్రతి భోజనం తర్వాత నడవండి

  • చిన్న చిన్న భాగాలుగా ఆహారం తీసుకోండి

  • కనీసం 8 గంటలు నిద్రపోండి

108 రౌండ్లు సూర్య నమస్కారాలు ఎలా చేయాలంటే..
సూర్య నమస్కారం అనేది బలం, చలనశీలత, వశ్యత, సమతుల్యత, హృదయ సంబంధ ఓర్పుని మిళితం చేసే ఒక పూర్తి శరీరా కదలికల క్రమం. 108 రౌండ్లు పూర్తి చేయడం అనేది రోజువారీ ఫిట్‌నెస్ అవసరం కంటే ఎక్కువ. పైగా శారీరకంగా మానసికంగా సవాలుగా ఉంటుంది. ఇన్ని సార్లు చేయాలంటే..నెమ్మదిగా సెషన్‌లు పెంచడమే తెలివైన విధానం అని అంటున్నారామె. 

పరుగు లేదా బలవర్ధక శిక్షణ మాదిరిగానే, పునరావృతమయ్యే కదలికలకు శరీరం అలవాటు పడటానికి సమయం పడుతుంది. కొన్ని రోజుల పాటు సూర్య నమస్కారాలను 30 నుంచి 60కి, ఆపై 90కి, చివరకు 108కి పెంచాలి.  

దీని వల్ల కండరాల ఓర్పు, కీళ్లు తట్టుకునే శక్తి, హృదయ సంబంధ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటం తోపాటు తరుచుగా అయ్యే గాయాల ప్రమాదాలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు యోగా నిపుణులు. అయితే ఇక్కడ రౌండ్లు పెంచడం అనేది వ్యక్తిగత ఫిట్‌నెస్‌ స్థాయిలు, వయస్సు, కోలుకునే సామర్థ్యం, టెక్నిక్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

అయితే సరైన పద్ధతిలో 20–30 సూర్య నమస్కారాలు సునాయాసంగా చేసేవారికి, ప్రతి వారం మరిన్ని అదనపు రౌండ్లు జోడించొచ్చు కానీ..ప్రారంభకులు మాత్రం ఒకేసారి ఎక్కువ రౌండ్లు చేస్తే మాత్రం మణికట్టు నొప్పి, భుజం బెణకడం, నడుము నొప్పి లేదా అధిక అలసటకు దారితీయవచ్చు. 

ఒక సూర్యనమస్కారం భుజాలు, ఛాతీ, వీపు, కోర్‌, గ్లూట్స్‌, కాళ్లతో సహా అనేక కండర సముహాలను కదిలిస్తుంది. అలాంటిది వీటిని వందసార్లకు పైగా పునరావృతం చేస్తే..కీళ్లు, కండరాలపై గణనీయమైన భారం పడుతుందనేది గుర్తెరగాలి. కాబట్టి వీటన్నింటిన పరిగణలోని తీసుకుని యోగా నిపుణులు సమక్షంలో చేయడం ఉత్తమం. 

వైద్యపరంగా కూడా సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిలకడగా..చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామటుకు క్రమం తప్పకుండా చేస్తే 12–24 నాణ్యమైన రౌండ్లు మంచి ప్రయోజనాలు ఇస్తాయని నమ్మకంగా చెప్పారు.

ఎవరైనా 108 చేయాలనుకుంటే..

  • 1–2 వారాలు: 24–30 రౌండ్లు

  • 3–4 వారాలు: 40–50 రౌండ్లు

  • 5–6 వారాలు: 60–75 రౌండ్లు

  • 7–8 వారాలు: 90+ రౌండ్లు

ఆ తర్వాత, రికవరీ టెక్నిక్ బలంగా ఉన్నప్పుడు 108 ప్రయత్నిస్తే మంచిదని అన్నారు. ఇక్కడ ఫిట్‌నెస్ సవాళ్లను పరీక్షలా కాకుండా, శిక్షణలా స్వీకరించాలని అన్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే మందుకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: థాయిలాండ్‌లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్‌ ..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement