‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది | The Magic of Seven: Why This Number is Considered Lucky | Sakshi
Sakshi News home page

‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది

Aug 5 2026 6:13 PM | Updated on Aug 5 2026 6:16 PM

The Magic of Seven: Why This Number is Considered Lucky

కొంతమందికి కొన్ని సంఖ్యలపై ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. అవి తమ జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తాయని భావిస్తుంటారు. ఏడు అనేది అపశకునం అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్మకం. అయితే.. ఇక్కడో వ్యక్తి లక్కీ నంబర్‌ ‘7’. చిన్నప్పటి నుంచి తనకు అదృష్ట సంఖ్యగా భావిస్తూ వచ్చాడు. అదే అతన్ని..చివరకు కోటీశ్వరుడిని కూడా చేసింది.

అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రం బిస్కో పట్టణానికి చెందిన టోమస్‌ మునోజ్‌‌కు లాటరీలో ఏకంగా 10 లక్షల డాలర్లు (సుమారు రూ.9.5 కోట్లు) జాక్‌పాట్‌గా తగిలింది. నార్త్‌ కరోలినా ఎడ్యుకేషన్‌ లాటరీ కొత్తగా ప్రారంభించిన ట్రిపుల్‌ రెడ్‌ 777 జాక్‌పాట్‌ స్క్రాచ్‌-ఆఫ్‌ గేమ్‌లో ఆయన ఈ భారీ బహుమతిని గెలుచుకున్నారు. కాండర్‌లోని ఓ దుకాణంలో 10 డాలర్ల విలువైన ట్రిపుల్‌ రెడ్‌ 777 జాక్‌పాట్‌ టికెట్‌ కనిపించగానే దాన్ని కొనాలని మునోజ్‌ నిర్ణయించుకున్నారు. కారణం.. ఆ టికెట్‌పై ఉన్న మూడు ‘7’లే.

“ఏడు నా అదృష్ట సంఖ్య. నేను 1977లో 7వ తేదీన పుట్టాను” అని మునోజ్‌ తెలిపారు. తన జీవితంలో 7 నంబర్‌కు ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. టికెట్‌ను దుకాణంలోనే స్క్రాచ్‌ చేసిన మునోజ్‌.. భారీ బహుమతి గెలిచిన విషయం తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. “నా శరీరం మొత్తం రకరకాల భావోద్వేగాలతో నిండిపోయింది” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

లాటరీ సంస్థ నుంచి బహుమతి తీసుకునే సమయంలో మునోజ్‌కు రెండు అవకాశాలు ఇచ్చారు. 20 ఏళ్ల పాటు ఏడాదికి 50 వేల డాలర్ల చొప్పున తీసుకోవడం లేదా ఒకేసారి నగదు తీసుకోవడం. ఆయన రెండో ఎంపికను ఎంచుకున్నారు. ఒకేసారి 6 లక్షల డాలర్లు తీసుకున్నారు. పన్నులు మినహాయించిన తర్వాత ఆయనకు 3,96,060 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లకు పైగా) అందాయి.ఈ డబ్బును పెట్టుబడులు పెట్టడంతో పాటు, తనకు ఇష్టమైన పాతకాలపు కార్ల పునరుద్ధరణ (క్లాసిక్‌ కార్‌ రీస్టోరేషన్‌) పనులకు ఉపయోగించనున్నట్లు మునోజ్‌ తెలిపారు.

ఇక ట్రిపుల్‌ రెడ్‌ 777 జాక్‌పాట్‌ గేమ్‌లో మొత్తం మూడు మిలియన్‌ డాలర్ల బహుమతులు ఉండగా.. అందులో మరో రెండు మిలియన్‌ డాలర్ల బహుమతులు ఇంకా గెలుచుకోవాల్సి ఉంది. అదృష్ట సంఖ్యలపై నమ్మకం ఉండటం ఒకవైపు అయితే.. అదే సంఖ్యతో జీవితాన్ని మార్చే అవకాశం రావడం మాత్రం మునోజ్‌ విషయంలో అరుదైన యాదృచ్ఛికంగా మారింది. ‘7’ అతడికి కేవలం సంఖ్య కాదు.. అదృష్టాన్ని తెచ్చిన గుర్తుగా నిలిచిపోయింది.

(చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ డైరెక్టర్‌ ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement