నేటి యువత ఖర్చుల బాట.. | Are You Wasting Your 20s Salary Bengaluru Lifestyle Inflation Sparks Debate | Sakshi
Sakshi News home page

నేటి యువత ఖర్చుల బాట..

Aug 3 2026 8:35 AM | Updated on Aug 3 2026 8:35 AM

Are You Wasting Your 20s Salary Bengaluru Lifestyle Inflation Sparks Debate

వయసు ఇరవైల్లో వచ్చే ఆదాయం రేపటి భవిష్యత్తుకు పునాది కావాలా? లేక నేటి లైఫ్‌స్టైల్ ఆర్భాటాలకు వేదిక కావాలా?.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగంలో హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. ఐటీ హబ్ బెంగళూరులో నివసిస్తున్న సిమ్రిధి మఖిజా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆలోచనలు నేటి తరం ఆర్థిక అలవాట్లపై చర్చకు దారితీశాయి.

బెంగళూరులో గత ఏడు నెలలుగా ఉంటున్న మఖిజా 20 ఏళ్లలో ఉన్న యువత పాటిస్తున్న ఖరీదైన జీవనశైలిని ప్రశ్నించారు. ఎంత సంపాదించినా సరసమైన ధరకు సేవలు లభించే చోట కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.

జీవనశైలి ద్రవ్యోల్బణంపై ప్రశ్నలు

మఖిజా తన వీడియోలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘ఒక్క పూట కేఫ్‌ల కోసం ఏకంగా రూ.5,000 ఖర్చు చేస్తున్నారు. మంచి ఇల్లు రూ.20,000కే లభించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం హోదా కోసం నెలకు రూ.40,000 అద్దె చెల్లిస్తున్నారు. ఒక్క విహారయాత్ర లేదా షాపింగ్‌ కోసం రూ.20,000 తగలేస్తున్నారు. ఆదాయం పెరిగినంత మాత్రాన స్వయంచాలకంగా ఖర్చులు పెంచుకుంటూ పోయే లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ ప్రమాదకరం’ అని ఆమె హెచ్చరించారు. ‘కెరీర్ ప్రారంభంలో సంపాదన పెరగాలి గానీ, ఖర్చులు కాదు. భవిష్యత్తు చాలా అనూహ్యమైంది. అందుకే తక్కువ ఖర్చు చేస్తూ గరిష్టంగా పొదుపు చేయడమే ఉత్తమం’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

నెటిజన్ల స్పందన

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం మీ జీతాల పెరుగుదలను మింగేయకుండా చూసుకోండి’ అని పొదుపు వాదనను కొందరు సమర్థిస్తున్నారు. ‘20ల్లో ఉన్నప్పుడు డబ్బు దాచడంపై కాకుండా సంపాదనను ఎలా పెంచుకోవాలో ఆలోచించండి. సంపాదిస్తున్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించడంలో తప్పు లేదు’ అని ఇంకొందరు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement