breaking news
Wasting Money
-
నేటి యువత ఖర్చుల బాట..
వయసు ఇరవైల్లో వచ్చే ఆదాయం రేపటి భవిష్యత్తుకు పునాది కావాలా? లేక నేటి లైఫ్‌స్టైల్ ఆర్భాటాలకు వేదిక కావాలా?.. ఇప్పుడు ఇంటర్నెట్లో పర్సనల్ ఫైనాన్స్ విభాగంలో హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. ఐటీ హబ్ బెంగళూరులో నివసిస్తున్న సిమ్రిధి మఖిజా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆలోచనలు నేటి తరం ఆర్థిక అలవాట్లపై చర్చకు దారితీశాయి.బెంగళూరులో గత ఏడు నెలలుగా ఉంటున్న మఖిజా 20 ఏళ్లలో ఉన్న యువత పాటిస్తున్న ఖరీదైన జీవనశైలిని ప్రశ్నించారు. ఎంత సంపాదించినా సరసమైన ధరకు సేవలు లభించే చోట కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.జీవనశైలి ద్రవ్యోల్బణంపై ప్రశ్నలుమఖిజా తన వీడియోలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘ఒక్క పూట కేఫ్‌ల కోసం ఏకంగా రూ.5,000 ఖర్చు చేస్తున్నారు. మంచి ఇల్లు రూ.20,000కే లభించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం హోదా కోసం నెలకు రూ.40,000 అద్దె చెల్లిస్తున్నారు. ఒక్క విహారయాత్ర లేదా షాపింగ్ కోసం రూ.20,000 తగలేస్తున్నారు. ఆదాయం పెరిగినంత మాత్రాన స్వయంచాలకంగా ఖర్చులు పెంచుకుంటూ పోయే లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్ ప్రమాదకరం’ అని ఆమె హెచ్చరించారు. ‘కెరీర్ ప్రారంభంలో సంపాదన పెరగాలి గానీ, ఖర్చులు కాదు. భవిష్యత్తు చాలా అనూహ్యమైంది. అందుకే తక్కువ ఖర్చు చేస్తూ గరిష్టంగా పొదుపు చేయడమే ఉత్తమం’ అని ఆమె అభిప్రాయపడ్డారు.నెటిజన్ల స్పందనఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం మీ జీతాల పెరుగుదలను మింగేయకుండా చూసుకోండి’ అని పొదుపు వాదనను కొందరు సమర్థిస్తున్నారు. ‘20ల్లో ఉన్నప్పుడు డబ్బు దాచడంపై కాకుండా సంపాదనను ఎలా పెంచుకోవాలో ఆలోచించండి. సంపాదిస్తున్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించడంలో తప్పు లేదు’ అని ఇంకొందరు చెబుతున్నారు. -
పెళ్లెందుకు? డబ్బు దండగ!
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరు? అంటే ఇదీ ఒక ప్రశ్నేనా? అని ఎవరైనా అంటారు. యస్.. బ్యాచిలర్స్‌లో సీనియర్ బ్యాచిలర్ అయిన సల్మాన్ ఖాన్ పేరు ఎవరైనా చెప్పేస్తారు. 51 ఏళ్లు నిండినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారీ కండలవీరుడు. సల్మాన్ ఏ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నా విలేకరులు అడిగే కామన్ ప్రశ్న ఒక్కటే. ‘మీ పెళ్లెప్పుడు’? అని. దానికి తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యలు చేస్తూ పెళ్లి మాట దాటవేస్తుంటారు సల్లూ భాయ్. తాజాగా మరోసారి సల్మాన్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ‘ట్యూబ్‌లైట్’ చిత్రం ప్రమోషన్లో పాల్గొన్న సల్మాన్.. ‘పెళ్లితో డబ్బు వృథా’ అంటూ చేసిన వ్యాఖ్యలు చాలామందిని నవ్వించాయి. ‘‘నా వరకూ పెళ్లి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పెళ్లంటే డబ్బు వృథా చేసుకోవడమే. పెళ్లి మీద నాకు నమ్మకం లేదు. నేను కేవలం అవసరాన్నే నమ్ముతా. మన జీవితానికి ఎవరు అవసరమవుతారన్నదే ఆలోచిస్తా’’ అన్నారు. పెళ్లయితే వేస్ట్ అంటున్నారు కానీ, సల్మాన్ ఎఫైర్లు మాత్రం వేస్ట్ అనడంలేదు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, సంగీతా బిజ్లానీ, తాజాగా లులియా వంతూర్.. ఇలా ఈయనగారి గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్ చాలానే ఉంది. ఈ లిస్ట్ ఇంతటితో ఆగుతుందా?


