పెళ్లెందుకు? డబ్బు దండగ!
బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరు? అంటే ఇదీ ఒక ప్రశ్నేనా? అని ఎవరైనా అంటారు.
బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరు? అంటే ఇదీ ఒక ప్రశ్నేనా? అని ఎవరైనా అంటారు. యస్.. బ్యాచిలర్స్‌లో సీనియర్ బ్యాచిలర్ అయిన సల్మాన్ ఖాన్ పేరు ఎవరైనా చెప్పేస్తారు. 51 ఏళ్లు నిండినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారీ కండలవీరుడు. సల్మాన్ ఏ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నా విలేకరులు అడిగే కామన్ ప్రశ్న ఒక్కటే. ‘మీ పెళ్లెప్పుడు’? అని. దానికి తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యలు చేస్తూ పెళ్లి మాట దాటవేస్తుంటారు సల్లూ భాయ్.
తాజాగా మరోసారి సల్మాన్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ‘ట్యూబ్‌లైట్’ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న సల్మాన్.. ‘పెళ్లితో డబ్బు వృథా’ అంటూ చేసిన వ్యాఖ్యలు చాలామందిని నవ్వించాయి. ‘‘నా వరకూ పెళ్లి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పెళ్లంటే డబ్బు వృథా చేసుకోవడమే. పెళ్లి మీద నాకు నమ్మకం లేదు. నేను కేవలం అవసరాన్నే నమ్ముతా. మన జీవితానికి ఎవరు అవసరమవుతారన్నదే ఆలోచిస్తా’’ అన్నారు. పెళ్లయితే వేస్ట్ అంటున్నారు కానీ, సల్మాన్ ఎఫైర్లు మాత్రం వేస్ట్ అనడంలేదు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, సంగీతా బిజ్లానీ, తాజాగా లులియా వంతూర్.. ఇలా ఈయనగారి గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్ చాలానే ఉంది. ఈ లిస్ట్ ఇంతటితో ఆగుతుందా?


