షాకింగ్‌ : ఐఏఎఫ్ ఆఫీస‌ర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..! | IAF officer wife pleading in alleged conversion case viral video | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : ఐఏఎఫ్ ఆఫీస‌ర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!

Jun 16 2026 5:28 PM | Updated on Jun 16 2026 5:39 PM

IAF officer wife pleading in alleged conversion case viral video

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్‌లో భారత వైమానిక దళ (IAF) అధికారి భార్యపై ఆమె పాత క్లాస్‌మేట్‌ దారుణానికి పాల్పడిన వైనం దిగ్భ్రాంతి రేపింది. మత్తుమందిచ్చి అత్యాచారం చేశారని, అసభ్యకరమైన వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేశారని, అలాగే మతం మారేలా ఒత్తిడి చేశారని  బాధిత ఆరోపించారు. దీనికి సంబంధించి వీడియో కీలక సాక్ష్యంగా మారింది.

బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం 24 ఏళ్ల బాధిత మహిళను ఆమె పాత క్లాస్‌మేట్ అయిన అయాజ్ తాజ్ మదారే (26) ఆస్తి కొనుగోలు నెపంతో నాగపూర్‌లోని వార్ధా రోడ్డులో ఉన్న ఒక హోటల్‌కు పిలిపించాడు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను అశ్లీల వీడియోలుగా, ఫోటోలుగా రికార్డు చేశాడు. ఆ వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, ఆమెపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె నుండి రూ. 3.09 లక్షలు వసూలు చేశాడు.

 ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి

అంతేకాదు  బాధితురాలిని ఇస్లాం మతంలోకి మారాలని నిందితుడు ఒత్తిడి చేశాడు. మే నెలలో ఆమెను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమీన్ షేక్, హజ్రత్ మౌలానా అనే మరో ఇద్దరి సహాయంతో మతమార్పిడి ఆచారాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది, అందులో మహిళ తనను వదిలేయమని అరుస్తున్నప్పటికీ నిందితుడు బలవంతంగా పట్టుకుని మంత్రాలు చదువుతూ కనిపించాడు. ఆ తర్వాత ఆమెకు అయాజ్‌తో పెళ్లయిందని చెప్పి, మళ్లీ అత్యాచారానికి ప్రయత్నించారు.

ఈ ఘటన 2025 ఫిబ్రవరిలో జరిగినప్పటికీ, భయంతో మౌనంగా ఉన్న మహిళ ఇటీవల తన భర్తకు విషయం చెప్పింది. జూన్ 13న నాగపూర్‌లోని సోనేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  కేసు నమోదు చేసిన పోలీసులు అయాజ్ తాజ్ మదారే, అమీన్ షేక్లను అరెస్ట్ చేశారు. కోర్టు వారికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మూడో నిందితుడు మతమార్పిడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌలానా (మత గురువు) కోసం మధ్యప్రదేశ్‌కు ఒక బృందాన్ని పంపారు.

మహిళ తన ఫిర్యాదులో అత్యాచారం, బెదిరింపులు, మతమార్పిడి, క్షుద్రపూజలు జరిగినట్లు ఆరోపించిదని 
సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ సురేష్ రెడ్డి  వెల్లడించారు.

ఇదీ చదవండి:  అఫ్గాన్‌లో సోలో ట్రిప్‌, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్‌ నటుడు కూడా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement