చీరకట్టులో మైఖేల్ జాక్సన్ స్టెప్పులు అదుర్స్‌..! | Woman In Saree Recreates Michael Jackson’s Iconic Moves, Viral Dance Video Amazes Netizens | Sakshi
Sakshi News home page

చీరకట్టులో మైఖేల్ జాక్సన్ స్టెప్పులు అదుర్స్‌..!

Jun 16 2026 5:08 PM | Updated on Jun 16 2026 5:51 PM

Woman In Saree Nails Michael Jacksons Iconic Moves Goes Viral

పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ అంటే ఇష్టపడని వారుండరూ. ఆయనలా ఫాస్ట్‌గా మ్యూజిక్‌కి అనుగుణంగా స్టెప్‌లు వేసేందుకు తహతహలాడుతుంటారు. ఎందరో ఆయనకు శిష్యులుగా మారి ఎంతలా ప్రయత్నించేవారో కథలుకథలుగా విన్నాం. ఇప్పుడా మహానుభావుడు మన మధ్య లేకపోయినా..ఆయన ఆల్బమ్స్‌, పాటలు మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయ్‌. ఇదంతా ఎందుకంటే..ఓ మహిళ అచ్చం మైఖేల్‌ జాక్సన్‌ని తలపించేలా అద్భుతంగా స్టెప్పులు వేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో కంటెంట్‌ క్రియేటర్‌ కోమల్ సాంప్రదాయ చీర కట్టులో మైఖేల్‌ జాక్సన్‌లా అద్భుతమైన డ్యాన్స్‌ చేసింది. మైఖేల్ జాక్సన్ ఐకానిక్ హిట్ అయిన 'బిల్లీ జీన్' పాటకు కాళ్లు కదిపింది. ఆమె చీర కట్టుకుని మరీ.. మేఖేల్‌ జాక్సన్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా అద్భుతంగా డ్యాన్స్‌ చేయడం విశేషం. పాట ప్రారంభకాగానే సునాయాసంగా స్టెప్పులు వేసిందామె. అందులో పదునైన బాడీ ఐసోలేషన్స్, రోబోటిక్ పాపింగ్ సీక్వెన్సులు, లెజెండరీ మూన్‌వాక్ కూడా ఉన్నాయి. 

ప్రతి స్టెప్పు చాలా కచ్చితత్వంతో ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం విశేషం. ఆ వీడియోలో ఒక అమ్మ మేఖేల్‌ జాక్సన్‌ ఆల్బమ్స్‌ చూసి అభిమానిగా మారితే ఎలా ఉంటుందో అంటూ.. కంటెంట్‌ క్రియేటర్‌ కోమల్‌ అలా సంప్రదాయ చీర కట్టులో డ్యాన్స్‌ చేసి చూపిందంటూ ఇచ్చిన వివరణ కూడా అద్భుతంగా ఉంది. నిజానికి ఆ స్టెప్‌లు చీరకకట్టులో వేయడం అంత ఈజీ కాదు. కానీ కోమల్‌ మాత్రం అదరగొట్టేసింది. నెటిజన్లు కూడా అమ్మా మీ స్టెప్స్‌ అదుర్స్‌ అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ డ్రైవర్‌ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్‌ ఆమెకు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement