గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.6.44 వరకు, తదుపరి విదియ తె.4.22 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం: ఆరుద్ర రా.7.30 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.57 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు,అమృత ఘడియలు: లేవు.
సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.31
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం.... పరిచయాలు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనయోగం. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
వృషభం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం.... నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు, సోదరుల నుంచి కీలక సమాచారం. భూవివాదాల పరిష్కారం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కర్కాటకం.... రుణాలు చేయాల్సివస్తుంది. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
సింహం.... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.
కన్య.... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
తుల... మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు మీదపడతాయి.
వృశ్చికం.... పనుల్లో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు...... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో పూర్వవైభవం.
మకరం.....శ్రమకు ఫలితం కనిపిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
కుంభం...పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం.....వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో అకారణంగా విభేదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.


