
ఓట్ల కోసం విచ్చలవిడిగా హామీలిస్తున్నారు
బిహార్ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు
విపక్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం
పట్నా: ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్ష ఆర్జేడీ ఇస్తున్న హామీ ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. ఓట్ల కోసం విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే వారికి వేతనాలు చెల్లించడానికి నిధులు ఎక్కడి తీసుకొస్తారని ప్రశ్నించారు.
2.6 కోట్ల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వేతనాలు ఇవ్వాలంటే రూ.12 లక్షల కోట్లు కావాలన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు అది నాలుగు రెట్లు అని చెప్పారు. శుక్రవారం బిహార్ రాజధాని పట్నాలో మేధావులు, వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అది చొరబాటుదారులను కాపాడే యాత్ర అని విమర్శించారు.
దేశంలోకి అక్రమ వసలదారులను అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. భారత్ ధర్మశాల కాదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చాలని రాహుల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి చొరబాటుదారుల పేర్లను కచి్చతంగా తొలగిస్తామన్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలను నమ్ముకుంటున్న కాంగ్రెస్, ఆర్జేడీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని అమిత్ షా పిలుపునిచ్చారు. అభివృద్ధికే పెద్దపీట వేస్తున్న బీజేపీని గెలిపించాలని కోరారు. బిహార్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఘనతలను ఆయన ప్రస్తావించారు.
బిహార్ క్షేమంగా ఉండొద్దా?
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ మొహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామాకు బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ టికెట్ ఇవ్వడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి దిగితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బిహార్ క్షేమంగా ఉండాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. సారణ్ జిల్లాలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. నేరగాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆర్జేడీ లాంటి పారీ్టల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. లాలూ–రబ్రీ హయాంలో బిహార్ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిందని ఆరోపించారు. జంగిల్ రాజ్ నుంచి సీఎం నితీశ్ కుమార్ విముక్తి కల్పించారని అమిత్ షా ప్రశంసించారు. అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయేను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు.