breaking news
job for every house
-
కుటుంబానికో ఉద్యోగం ఎలా సాధ్యం?
పట్నా: ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్ష ఆర్జేడీ ఇస్తున్న హామీ ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. ఓట్ల కోసం విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే వారికి వేతనాలు చెల్లించడానికి నిధులు ఎక్కడి తీసుకొస్తారని ప్రశ్నించారు. 2.6 కోట్ల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వేతనాలు ఇవ్వాలంటే రూ.12 లక్షల కోట్లు కావాలన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు అది నాలుగు రెట్లు అని చెప్పారు. శుక్రవారం బిహార్ రాజధాని పట్నాలో మేధావులు, వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అది చొరబాటుదారులను కాపాడే యాత్ర అని విమర్శించారు. దేశంలోకి అక్రమ వసలదారులను అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. భారత్ ధర్మశాల కాదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చాలని రాహుల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి చొరబాటుదారుల పేర్లను కచి్చతంగా తొలగిస్తామన్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలను నమ్ముకుంటున్న కాంగ్రెస్, ఆర్జేడీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని అమిత్ షా పిలుపునిచ్చారు. అభివృద్ధికే పెద్దపీట వేస్తున్న బీజేపీని గెలిపించాలని కోరారు. బిహార్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఘనతలను ఆయన ప్రస్తావించారు. బిహార్ క్షేమంగా ఉండొద్దా? కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ మొహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామాకు బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ టికెట్ ఇవ్వడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి దిగితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బిహార్ క్షేమంగా ఉండాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. సారణ్ జిల్లాలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. నేరగాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆర్జేడీ లాంటి పారీ్టల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. లాలూ–రబ్రీ హయాంలో బిహార్ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిందని ఆరోపించారు. జంగిల్ రాజ్ నుంచి సీఎం నితీశ్ కుమార్ విముక్తి కల్పించారని అమిత్ షా ప్రశంసించారు. అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయేను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. -
అధికారమిస్తే ఇంటికో ఉద్యోగం
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలకమైన ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కోటికి పైగా ఉన్న యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోగా ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెస్తామని, 20 నెలల్లోనే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. యువతను ఆకట్టుకునేందుకు పోటాపోటీ.. బిహార్‌లోని మొత్తం 7.42 కోట్ల ఓటర్లలో 18–35 ఏళ్ల వారి సంఖ్య 1.60 కోట్ల వరకు ఉంది. ఇటీవల యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో 18–29 ఏళ్ల వారిలో దాదాపు 44.6 శాతం మంది ఎన్డీయేకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని, 39.5 శాతం మంది మహాఘట్బంధన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. సుమారు 42 శాతం మంది బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌ను ఇష్టపడుతున్నట్లు తేల్చారు. కేవలం 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి నితీష్ ముందుగానే యువతకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ’ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన’పథకం కింద, 12వ తరగతి అర్హత సాధించిన విద్యార్థులకు రూ. 4,000, ఐటీఐ లేక డిప్లొమా ఉన్నవారికి రూ. 5,000, ఇంటర్న్‌షిప్‌లు తీసుకుంటున్న గ్రాడ్యుయేట్లు లేక పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.6,000 అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటే 2025– 26 నుంచి 2030–31 వరకు రాష్ట్రం నుంచి లక్ష మంది యువతకు వివిధ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించారు. దీనిని ఎదుర్కొ ని యువతను తనవైపు తిప్పికునే లక్ష్యంతో ఆర్జేడీ నేత తేజస్వీ ‘ఛాత్ర యువ సంసద్’కార్యక్రమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చచేశారు. యువజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, విద్యాపరంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఇంటి నుంచి ట్యూటర్లను అందిస్తామని, పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణాను కల్పిస్తామని ప్రకటించారు.సైన్స్, గణితం, ఇంగ్లిష్‌లలో వెనుకబడ్డ ఉన్న విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారికి అదనపు సమయం కేటాయిస్తామన్నారు. బిహార్ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు మరోసారి ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని హామీలు గుప్పించినా ప్రధాని నరేంద్ర మోదీ, నితీశ్‌కుమార్ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు యువత పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంతో ఎన్నికల షెడ్యూల్ అనంతరం గురువారం తొలి ఎన్నికల వాగ్ధానం ప్రకటించారు. ‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండేలా చూస్తాం. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు దీని కోసం చట్టం తెస్తాం. 20 నెలల్లో ఒక్క ఇళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండదు‘అని ప్రకటించారు. ప్రస్తుత నితీశ్ ప్రభుత్వం 20ఏళ్లుగా ఎన్నడూ నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని ఎన్నడూ గుర్తించలేదని, తానుగత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాలను హామీ ఇచ్చి, అధికారంలో ఉన్న కొద్ది కాలంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించానని గుర్తు చేశారు. ఐదేళ్లపాటు పదవిలో కొనసాగితే ఏమి సాధ్యమవుతుందో మీరు ఊహించవచ్చని తేజస్వీ పేర్కొన్నారు. -
మామా.. ఇంటికో ఉద్యోగం అటకెక్కినట్టేగా!
అమరావతి, కైకలూరు : అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. లేదంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాం.. ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమాటలివి. తిరిగి ఎన్నికల దగ్గరపడటం, దగాపడ్డా నిరుద్యోగ యువత ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌కు గోడు చెప్పుకోవడంతో నాలుగేళ్లకు ఎన్నికల హామీ గుర్తొంచింది. చేసేది లేక ఆంక్షల కత్తితో హడావుడిగా నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ప్రకటించింది. తీరా రూ.2వేలు భృతి కాస్తా రూ.1000కి దిగజారింది. ఇక ఎన్నికల ప్రణాళికలో చెప్పకుండా పది, ఇంటర్ చదివిన విద్యార్థులకు భృతి లేదంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత నిస్తేజంగా చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు ఏ గ్రామ రచ్చబండపై చూసిన ఇదే చర్చ. దీనిపై ఓ నలుగురు గ్రామస్తులు మధ్య సాగిన సంభాషణ ఇది.. అప్పలస్వామి : అన్నాలైనాయా బద్రయ్య మామ? అత్తకు నలత చేసిందంటగా.. పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లలేదా..? బద్రయ్య : ఏం.. చెప్పేది అల్లుడా.. (కండువాతో ముఖం తుడుచుకుంటూ) అతి కష్టం మీద అప్పు చేసి కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టా.. కొడుకుని చదివించిన ఉద్యోగం రాలేదు.. మీ అత్తా నేను, రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని అప్పులు తీరవు. పగోడికి కూడా వద్దురా బాబు.. ఈ కట్టాలు.. స్వామి :అదేంటి మామ.. మొన్న ఎన్నికల్లో చదువుకున్న కుర్రోళ్లకు నెలకు రెండేలు ఇత్తానని చంద్రబాబు చెప్పుడుగా.. ఆ లెక్కన మీ వోడుకి నాలుగేళ్లులో మొత్తం 98 వేలు రావాలి కదా.. బద్రయ్య : ఓరి నా పిచ్చినా అల్లుడా.. లేని నదిపై వంతెన కట్టిస్తాననేవాడేరా.. ఈ రోజుల్లో పెద్ద రాజకీయ నాయకుడు. ఎన్నికల ముందు బాబుగారేమన్నారు.. ఉద్యోగం లేకపోతే ఒక్కొక్కలికి రెండేసి వేలు బ్యాంకుల్లో వేసేత్తానన్నారు. ఇప్పుడేమో పొలం ఎక్కువుంటే ఇవ్వరంటా.. అందునా 35 సంవత్సరాలు దాటితే కుదరదంటా.. మరి ఎన్నికలప్పుడు ఈ షరతులు గుర్తుకు రాలేదా..! స్వామి : అది నిజమేగాని మామ.. ఆ చెరువు గట్టు నుంచి హడావుడిగా వస్తుంది మన ఊరు ప్రసాదం పంతులుగారబ్బాయి రవి కదా..బద్రయ్య : అవునల్లుడు.. అతను పాలిటెక్నిక్ వరకూ చదివినట్లున్నాడు.. ఓ సారి ఇక్కడకు రమ్మను.. స్వామి : ఓ.. రవిబాబు.. ఉరుకులు పరుగుల మీద వెళుతున్నాం.. ఓ సారి ఇటురా.. బద్రయ్య మామా పిలుస్తున్నాడు..రవి : (వస్తూ.. వస్తూనే..) ఊరు పెద్దలంతా రచ్చబండపై పెద్ద మీటింగే పెట్టారే.. మాన గుడిలో నైవేద్యం సరుకులకు వెళుతున్నా.. చెప్పండి ఏంటీ పని? బద్రయ్య : కాస్తంత కూచోవయ్యా.. రవిబాబు.. పేపర్లో ఈ రోజు నిరుద్యోగ భృతి కింద డబ్బులిస్తారని రాశారు.. అదెంటో చెప్పు.. రవి : అహా.. అదా విషయం.. చెబుతాను వినండి.. ఈ రోజుల్లో సదువుకున్నోడికన్నా.. సంతలో వ్యాపారం చేసేవాడే నయమనిపిస్తోంది. నిరుద్యోగులందరికి నెలకు రూ.2000 అని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రూ.1000 ఇస్తామంటున్నారు. దీనికి తోడు 2.50 ఎకరాలు పొలం ఉండకూదంటా. నాలుగు చక్రాలు వాహనం ఉన్నా రాదంటా. ఇక పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివినోళ్లకు ఇవ్వరంటా. ఎన్నికల మ్యానిఫేస్టోలో ఇవన్ని ఎందుకు పెట్టలేదో ఆ పెరుమాళ్లకే ఎరుక. అందరికి అర్థమయ్యిందా.. ఏసురాజు : (చుట్ట వెలిగిస్తూ).. రవి బాబు.. నీ మాటకు అడ్డు వస్తున్నానని ఏం అనుకోకూ.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అనుభవించి, ఎన్నికల దగ్గర పడుతుంటేనే వీళ్లకు హామీలు గుర్తుకొస్తాయా.. నాలుగేళ్లుగా నెలకు రెండు వేలు చొప్పున మీకు 96 వేలు రావాలి కదా.. వాటి సంగతేంటి.. రవి : మంచి ప్రశ్నే అడిగావు ఏసయ్య.. మళ్లీ మన ఓట్లు కావాలి కదా మరి. హామీలన్ని ఎన్నికల వేళ గుర్తుకు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలు చేసిన యువకులకు భృతి ఇవ్వరంటా.. నిరుద్యోగులు సాయం చేసే విషయంలో ఇన్ని నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకో అర్థం కావడం లేదు. ఏసురాజు : రవి బాబు ఇంకో విషయం.. మన ప్రాంతంలో రొయ్యల రైతులకు కరెంటు యూనిట్ రూ.1.50 పైసలకు ఇస్తానని ప్రతిపక్ష నేత జగన్న్చెప్పగానే చంద్రబాబు అప్పటి వరకు వసూలు చేస్తున్న రూ.3.80లను రూ.2.00 లకే ఇస్తానని వెంటనే ప్రకటించేశారు. నిరుద్యోగులందరూ ఓ సారి జగన్‌ను వెళ్లి కలవండి.. మార్పు ఉంటుందేమో.. దావీదు (ఏసు రాజు కొడుకు) : నాన్నో.. కిందటి నెల కరెంటు బిల్లు కట్టలేదంటా.. కరెంటోళ్లు వచ్చి ఫీజు పీకేశారు.. అమ్మ టీవీలో సీరియల్ ఆగిపోయిందని శివాలెత్తుతుంది.. బేగా వచ్చేయ్.. ఏసురాజు : అమ్మ బాబోయ్ కొంప మునిగింది.. సీరియల్ ఆగిందా.. నేనయిపోయా.. ఉంటానండి.. రేపు కలుద్దాం.. అంటూ పరిగెత్తాడు. అందరూ ఇంటి ముఖం పట్టారు. -
డీఎస్సీ.. బుస్సేనా!
కర్నూలు విద్య: ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తరువాత వాటిని మరిచిపోయారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా ఎప్పటి నుంచో స్పష్టంగా చెప్పడం లేదు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రోజుకో మాట మాట్లాడుతూ నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వస్తుందో లేదోననే ఆందోళన నెలకొంది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు తాత్కాలిక సర్దుబాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ తరువాత మరి కొద్ది రోజులకు డీఎస్సీ నోటిఫికేషన్ అని.. లేదు లేదు ముందుగా టెట్ పెట్టి ఆ తరువాత కొత్త పోస్టులు భర్తీ చేస్తామని.. మరి కొద్ది రోజులకే టెట్, డీఎస్సీ రెండు ఒకే రోజు నిర్వహిస్తామంటూ ప్రకటనలు చేశారు. ఇంత వరకు దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన ప్రకారమైతే టెట్ నోటిఫికేషన్ ఈ నెల 15లోపు రావాలి. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ఆ అవకాశం లేదు. వచ్చే నెల మొదటి వారంలోనే టెట్ నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామంటూనే ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే 6,7 తరగతులలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా కుదించారు. దీంతో పరోక్షంగా కొత్త పోస్టులు తగ్గే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జీవో నంబర్లు 55, 61ల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ప్రకారం రేషనలైజేషన్ చేసిన తరువాత ఎన్ని పోస్టులు మిగులుతాయనే దానిపై కసరత్తు చేయించి వివరాలను ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం జిల్లాలో 730 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని రేషైనలైజేషన్ చేసిన తరువాత మిగిలే వాటిలో అవసరం మేరకు డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అప్పటి వరకు నిరుద్యోగ అభ్యర్థులకు ఉత్కంఠ తప్పదు. ఈ ఏడాది మే 31వ తేదీ వరకు ఖాళీలు అయిన పోస్టులను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లాలో 730 పోస్టులలో ఎస్జీటీలు 497, లాంగ్వేజ్ పండిట్స్ 98, పీఈటీ 13, స్కూల్ అసిస్టెంట్లు 122 ఖాళీలు ఉన్నాయి. టెట్‌కు పాత సిలబస్.. డీఎస్సీకి కొత్త సిలబస్ 2012-14 డీఎడ్ బ్యాచ్ ఛాత్రోపాధ్యాయులకు డీఎస్సీలో అవకాశం ఇచ్చేందుకు ఖచ్చితంగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. డీఎస్సీ రోజే ఉదయం ఒక పేపరుగా టెట్ నిర్వహంచాలని, ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ జవాబు పత్రాలను దిద్దుతారు. గతంలో టెట్ అర్హత సాధించిన వారు కూడా మళ్లీ రాయొచ్చు. దేనిలో అధిక మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. టెట్ మాత్రం గతంలో ఉన్న పాత సిలబస్ ప్రకారమే నిర్వహించి. డీఎస్సీకి ఈ విద్యా సంవత్సరంలోని నూతన సిలబస్ ప్రకారమే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రశ్నపత్రం నమూనా, ప్రశ్నల సరళి కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తెరపైకి కొత్త వాదన ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి పదోన్నతలు, బదిలీలు చేసిన తరువాతే రేషనలైజేషన్ చేయాలని ఆ తరువాతే కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. పదోన్నతులు, బదిలీలపై ఇటీవలే ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమపడుతోంది. ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.


