కృత్రిమ అవయవాల శిబిరం | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ అవయవాల శిబిరం

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

కృత్ర

కృత్రిమ అవయవాల శిబిరం

జయపురం: జయపురం నెహ్రూనగర్‌లో గల అగ్రసేన్‌ భవనంలోఒడిశా ప్రాంత మార్వాడీ యువచంచ్‌ వారు దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాల శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ భగవాన్‌ మహావీర్‌ వికలాంగ సహాయక సమితి రాంచి వారి సహకారంతో నిర్వహిస్తున్న కృత్రిమ అవయవాల శిబిరంలో కృత్రిమ కాళ్లు, మెకానికల్‌ చేతులు, ఎల్బో స్టిక్‌లు, వాకింగ్‌ స్టిక్‌లు, బ్‌లైండ్‌ స్టిక్‌లు, ఇయర్‌ ఎయొడ్లు అందజేశారు. కాళ్లు, చేతులు లేని వారికి కొలతలు తీసుకుని కృత్రిమ చేతులు, కాళ్లు తయారు చేసి అందజేశారు. సోమవారం శిబిరం ముగియనుంది. అంతవరకు ఎంత మంది వచ్చినా సహాయ పరికరాలు అందజేస్తామని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మాయంక అగ్రవాల్‌ తెలిపారు. శిబిరం నిర్వహణలో జయపురం మార్వాడీ యువ మంచ్‌ అధ్యక్షుడు కన్హ అగ్రవాల్‌, ప్రాజెక్టు చైర్మన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మయాంక్‌ అగర్వాల్‌, కన్వీనర్‌ వరుణ్‌ అగ్రవాల్‌, కార్యదర్శి విక్కీ అగర్వాల్‌, కోశాధికారి రోషన్‌ గోయల్‌, శ్రీభగవాన్‌ మహావీర్‌ వికలాంగ సమితి కార్యదర్శి నెమి చంద్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ అవయవాల శిబిరం1
1/5

కృత్రిమ అవయవాల శిబిరం

కృత్రిమ అవయవాల శిబిరం2
2/5

కృత్రిమ అవయవాల శిబిరం

కృత్రిమ అవయవాల శిబిరం3
3/5

కృత్రిమ అవయవాల శిబిరం

కృత్రిమ అవయవాల శిబిరం4
4/5

కృత్రిమ అవయవాల శిబిరం

కృత్రిమ అవయవాల శిబిరం5
5/5

కృత్రిమ అవయవాల శిబిరం

Advertisement
 
Advertisement
Advertisement