లోయలోకి దూసుకెళ్లిన లారీ
● డ్రైవర్, హెల్పర్‌కు గాయాలు
రాయగడ: సదరు సమితి గుమ్మ ఘాటీ మలుపులో కర్రల లోడుతో వస్తున్న లారీ శనివారం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో లారీ డ్రైవర్, హెల్పర్లకు గాయాలు తగిలాయి. వారిని వెంటనే అక్కడ ఉన్న వారు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సంఘటనా స్థలానికి కుంబికోట పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా బొరొగుమ్మ నుంచి కర్రల లోడుతో జేకేపూర్‌కు వస్తున్న లారీ గుమ్మఘాటీ మలుపు వద్ద అదుపుతప్పడంతో సుమారు 20 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ శివహరిజన్, హెల్పర్ నవీన్ భూమికలు లోయపడిపోవడతో గాయపడ్డారు. వారిని సమీపంలో ఉన్న వారు కాపడి వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసుల భావిస్తున్నారు.
లోయలోకి దూసుకెళ్లిన లారీ


