పాఠశాలల పరిశీలన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి శనివారం పరిశీలించారు. ఝరాపల్లి, పద్మాగిరి పంచాయతీల్లోని పాఠశాలలను డీఈవో సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అలాగే యం.వి.84, యం.వి.85 గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను కూడా సందర్శించారు. అనంతరం పద్మాగిరి పాఠశాలను సందర్శించి సౌకర్యాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
పాఠశాలల పరిశీలన


