ఘనంగా ఠాకూర్ అనుకూల చంద్ర జయంతి
జయపురం: జయపురం డొంగాగుడ ప్రాంతంలో ఉన్న సత్సంగ విహర్ ప్రాంగణంలో ఠాకూర్ అనుకూల చంద్ర 138వ జయంతి మహోత్సవాలతోపాటు సత్సంగ్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి కీర్తనలు, ప్రార్థనలు, గ్రంధ పఠనం, సంగీతాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్సంగ్, భజన కీర్తనలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటలకు మాతృ సమ్మేళనం ప్రారంభమైంది. శిశిర కుమార్ పరిజా పౌరోహిత్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిరంజన్ ఆచార్య వార్షిక నివేదిక సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా రితిక్, తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు వెయ్యి మంది భక్తు పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న ఆలయాలను పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. ఠాకూర్ జీవిత విశేషాలను భక్తులకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బినోద్ మహాపాత్రో వివరించారు. ఈ కార్యక్రమాన్ని పూర్ణచంద్ర స్వైన్, విశ్వజిత్ మిశ్రా, ప్రభాత్ దత్తా, సుకాంత నాయక్, భగవాన్ మహరాణ, సింహాద్రి పండా, భావగ్రహి బల, మదన్ మోహన్ నాయక్, ఖగేంద్ర బారిక్, నృసింహ సాహు, ధరణీధర్ సాహు, పరమేశ్వర పాత్రో, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఘనంగా ఠాకూర్ అనుకూల చంద్ర జయంతి
ఘనంగా ఠాకూర్ అనుకూల చంద్ర జయంతి


