కాంగ్రెస్ ఆందోళన
జయపురం: ఎపిస్టిన్ కేసులో సంబంధం ఉన్న ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాలని కొరాపుట్ జిల్లా మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గురువారం జయపురంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీణాక్షీ బాహిణీపతి నాయకత్వంలో, కొరాపుట్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నళినీరత్ పర్యవేక్షణంలో నిర్వహించిన ఆందోళనలో ప్రధాని, కేంద్రమంత్రి దిష్టి బొమ్మలను దహన పరిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానించారని మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అందుకు నిరసనగా ప్రధాని, కేంద్ర మంత్రి దిష్టి బొమ్మలను దహన పరచామని మీణాక్షి బాహిణీపతి వెల్లడించారు. ఈ ఆందోళనలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రూపక్ తురుక్, జయపురం మునిసిపాలిటీ చైర్మన్ నరేంద్ర కుమార్ మమంతి, మహిళా కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.


