ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

Mar 1 2026 7:29 AM | Updated on Mar 1 2026 7:29 AM

ఘనంగా

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

జయపురం: స్థానిక సరస్వతి విద్యా శారదా మందిరంలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యాలయ ప్రధాన శిక్షకులు సత్యనారాయణ సెట్టి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విజ్ఞాన ప్రాజెక్టులు, తదితర వాటిపై పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినవారికి బహుమతులు అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా రిటైర్డ్‌ హెచ్‌ఎం క్షీరోద్‌ కుమార్‌ భటమిశ్ర పాల్గొన్నారు. పాఠశాల పరిచాలన కమిటీ అధ్యక్షుడు కిశోర్‌ చంద్ర పండా, కార్యదర్శి బిజయ కుమార్‌ భట్‌, పాఠశాల విజ్ఞాన అధ్యాపకులు దిలీప్‌ కుమార్‌ శతపతి, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి విద్యార్థుల వికాశంలో విజ్ఞాన భూమికపై వివరించారు. పాఠశాల ఆచార్యులు అనంత నారాయణ మహాపాత్ర, కై ళాస్‌ చంఽద్ర పందా, రామచంద్ర మహంతి తదితరులు హాజరయ్యారు.

శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో..

పర్లాకిమిడి: జాతీయ సైన్స్‌ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల రుసా భవనంలో సైన్స్‌ ప్రదర్శనలను సైంటిస్టు భువనేశ్వర్‌ డాక్టర్‌ శాంతిభూషన్‌ సేనాపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్‌ రధాకాంత భుయ్యాన్‌, జాతీయ సైన్స్‌ డే కోఆర్డినేటరు నివేదిత సామల్‌, భిఘ్నేశ్వర్‌ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలకు ఎస్‌.కె.సి.జి కళాశాల లైఫ్‌సైన్స్‌, కాశీనగర్‌ శ్రీరాంకళాశాల, కేంద్రీయ విద్యాలయం ప్లస్‌టు, మోహనా హిల్‌టాప్‌ కళాశాల విద్యార్థులు 25 ప్రాజెక్టులు ప్రదర్శించారు. లైఫ్‌సైన్స్‌ కళాశాలలో వికసిత్‌ భారత్‌లో మహిళా విజ్ఞానవేత్తలు అన్న అంశంపై కర్మశాలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ రాధాకాంత భుయ్యాన్‌, శాంతిభూషణ్‌ సేనాపతిని

సన్మానించారు. ప్రొఫెసర్‌ కీర్తిరంజన్‌ దాస్‌, పలువురు ప్రొఫెసర్లను సత్కరించారు. ఉత్తమ విజ్ఞాన ప్రాజెక్టులు చేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం1
1/6

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం2
2/6

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం3
3/6

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం4
4/6

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం5
5/6

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం6
6/6

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement