చిత్రకొండ సమితిలో ఆయుధ ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

చిత్రకొండ సమితిలో ఆయుధ ప్రదర్శన

Mar 1 2026 7:29 AM | Updated on Mar 1 2026 7:29 AM

చిత్ర

చిత్రకొండ సమితిలో ఆయుధ ప్రదర్శన

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమతి 177 బెటాలియన్‌ బీఎస్‌ఎఫ్‌ జవాన్లు డైమండ్‌ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా శనివారం చిత్రకొండలో ఆదర్శ విద్యాలయంలో ఆయుధ పదర్శన నిర్వహించారు. ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, బీఎస్‌ఎఫ్‌ అధికారులు ఉపయోగించే వివిధ ఆయుధాలు, గోబాబారుదాలు, అత్యాధునిక కమ్యూనికేషన్‌ పరికరాలు ప్రదర్శించారు. సమారు 160 మంది విద్యార్థులు ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎఫ్‌ కమెండర్‌ ఎం.నౌషాద్‌ తమ శాఖ చరిత్ర, దేశానికి జవాన్లు అందిస్తున్న సేవలు వివరించారు. త్వరలో పరీక్షలు రాయనున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ మిఠాయిలను పంపిపెట్టారు. తమ పాఠశాలలో జవాన్లు ఆయుధ ప్రదర్శ చేసినందుకు ఉపాధ్యాయులు విశ్వశ్రీ విశ్వస్‌, ప్రభాత్‌ దాస్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

చిత్రకొండ సమితిలో ఆయుధ ప్రదర్శన1
1/1

చిత్రకొండ సమితిలో ఆయుధ ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement