మందిర పరిసరాలు అభివృద్ధి.. | - | Sakshi
Sakshi News home page

మందిర పరిసరాలు అభివృద్ధి..

Mar 2 2026 7:21 AM | Updated on Mar 2 2026 7:21 AM

మందిర

మందిర పరిసరాలు అభివృద్ధి..

జయపురం: జయపురం సమితి గొడొపొదర్‌ గ్రామంలో హనుమాన్‌ మందిరం ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు గొడొపొదర్‌ పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నడుంబిగించారు. జయపురం ప్రాంత ప్రజలే కాకుండా పలు ప్రాంతాల ప్రజలు గొడొపొదర్‌ హనుమాన్‌ మందిర ప్రాంతాన్ని పిక్నిక్‌ కేంద్రంగా వినియోగిస్తున్నారు. అందువల్ల ఆ పాంతాన్ని అభివృద్ధి పరచాలని భావించిన విద్యార్థులు ఆలయాన్ని సందర్శించి మొక్కలు నాటారు. గ్రామంలో ప్రజలను చైతన్య పరిచేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వ్యర్థపదార్థాలు వేసేందుకు రెండు డస్ట్‌బిన్‌లు సమకూర్చారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని ఆలయ నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మందికిపైగా విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ఎస్‌.ఎం.సి చైర్మన్‌ లయిచన్‌ నాయక్‌, జయపురం సిటీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్‌ పట్నాయక్‌ నేతృత్వంలో విద్యార్థులు పాల్గొని గొడొపొదర్‌ విద్యార్థులకు సహకరించారు. గొడొపొదర్‌ పాఠశాల హెచ్‌ఎం దిలీప్‌ పండా, తదితరులు పాల్గొన్నారు.

మందిర పరిసరాలు అభివృద్ధి..1
1/1

మందిర పరిసరాలు అభివృద్ధి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement